High Court | సీబీఐ తీరు స‌రైందికాదు.. వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి

High Court | వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ల దాఖ‌లు విచార‌ణ వ‌చ్చే గురువారానికి వాయిదా విధాత, హైకోర్టు: బెయిల్‌ పిటిషన్లను రెండు వారాల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని, ఆ మేరకు త్వరగా విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌ కుమార్‌రెడ్డి హైకోర్టును విజ్ఞప్తి చేశారు. బెయిల్‌ పిటిషన్‌లో వాదనలను జాప్యం చేసేందుకే సీబీఐ కావాలనే పేజీలకు పేజీల అఫిడవిట్‌ వేసిందన్నారు. సీబీఐ తీరు సరికాదన్నారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య […]

  • Publish Date - August 18, 2023 / 04:17 PM IST

High Court |

  • వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ల దాఖ‌లు
  • విచార‌ణ వ‌చ్చే గురువారానికి వాయిదా

విధాత, హైకోర్టు: బెయిల్‌ పిటిషన్లను రెండు వారాల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని, ఆ మేరకు త్వరగా విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌ కుమార్‌రెడ్డి హైకోర్టును విజ్ఞప్తి చేశారు. బెయిల్‌ పిటిషన్‌లో వాదనలను జాప్యం చేసేందుకే సీబీఐ కావాలనే పేజీలకు పేజీల అఫిడవిట్‌ వేసిందన్నారు. సీబీఐ తీరు సరికాదన్నారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టు తమ బెయిలు పిటిషన్లను కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజ‌న్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని, సీబీఐ అభియోగ పత్రాన్ని కూడా దాఖలు చేసిందని తెలిపారు.

ఈ కేసులో పిటిషనర్లను అక్రమంగా ఇరికించారని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేదన్నారు. ఇప్పటికే 5 నెలలకు పైగా జైలులో ఉన్నారని, భాస్కర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పారు. పలుమార్లు జైలు అధికారులు అస్పత్రుల్లో భాస్కర్‌రెడ్డి పరీక్షలు కూడా నిర్వహించారన్నారు. కాగా, ఈ సందర్భంగా సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇరువురి వాదనలు విన్న ధ‌ర్మాస‌నం త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే గురువారం 2:30 గంట‌ల‌కు వాయిదా వేసింది.

Latest News