Site icon vidhaatha

High Court | హైకోర్టు సీజేను క‌లిసిన న్యాయ‌శాఖ ఉద్యోగ సంఘం నాయ‌కులు

High Court

హైద‌రాబాద్‌, విధాత: నూతనంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన గౌరవ జస్టిస్ గౌరవ జస్టిస్ శ్రీ అలోక్ ఆరాదే గారిని మర్యాదపూర్వకంగా న్యాయ‌శాఖ ఉద్యోగ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ బోధ లక్ష్మారెడ్డి, రాష్ర్ట గౌరవ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు సుబ్బయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిరమణ రావు, తదితర తెలంగాణ రాష్ట్ర నాయకులు గురువారం తెలంగాణ హైకోర్టులోని వారి చాంబర్లో కలసి పుష్పగుచ్ఛం అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.

రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగస్తులపై త‌మ ఆశీస్సులు ఉండాలని కోర‌డంతో ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు రాష్ర్ట నాయ‌కులు తెలిపారు. అనంత‌రం సీజే అలోక్ అరాధే మాట్లాడుతూ.. ఉద్యోగులు బాగుంటేనే మీకున్న సమస్యలను పరిష్కరించబడితేనే మీరు సంతోషంగా పని చేయగలుగుతారని, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా స‌మాచారం ఇవ్వాల‌ని ఆయ‌న అధికారులకు సూచించారు. మీరు న్యాయవ్యవస్థలో అంతర్భాగమైనటువంటి బాధ్యతాయుతమైన వ్యక్తులని తెలిపారు.

Exit mobile version