High Court | 187 మంది 108 సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

High Court 108 సిబ్బందిని 8 వారాల్లోగా విధుల్లోకి తీసుకోండి ప్ర‌భుత్వ సంస్థను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు తుది ఉత్వ‌ర్వులు చేసిన జ‌స్టిస్ నందా హైదరాబాద్‌, విధాత: 187 మంది 108 సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని, ప్ర‌భుత్వ సంస్థ అయిన జీవీకే ఎంఆర్ఐను తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తూ.. ఉత్వ‌ర్వులు జారీ చేసింది. 2018 ఆగస్టులో 947 మంది 108 సిబ్బందిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ బాధిత […]

  • Publish Date - July 19, 2023 / 02:47 PM IST

High Court

  • 108 సిబ్బందిని 8 వారాల్లోగా విధుల్లోకి తీసుకోండి
  • ప్ర‌భుత్వ సంస్థను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు
  • తుది ఉత్వ‌ర్వులు చేసిన జ‌స్టిస్ నందా

హైదరాబాద్‌, విధాత: 187 మంది 108 సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని, ప్ర‌భుత్వ సంస్థ అయిన జీవీకే ఎంఆర్ఐను తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తూ.. ఉత్వ‌ర్వులు జారీ చేసింది. 2018 ఆగస్టులో 947 మంది 108 సిబ్బందిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ బాధిత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.

పలు కారణాల పేరుతో 187 మందిని మాత్రం విధుల్లోకి తీసుకోలేద‌ని ప్ర‌భుత్వం త‌రుపు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు. పిటీషినర్ త‌రుఫు న్యాయ‌వాది చిక్కుడు ప్ర‌భాక‌ర్ వాద‌న‌లు వినిపిస్తూ 108 అంబులెన్స్‌కు చెందిన డ్రైవ‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌, ఆప‌రేట‌ర్స్ ఇలా ప‌లు విభాగాల‌కు చెందిన 187 మంది ఉద్యోగుల‌ను విధుల్లోకి తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వెంట‌నే వారిని విధుల్లోకి తీసుకొని ఆదుకోవాల‌ని కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు.

ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న జ‌స్టిస్ నందా 8 వారాల్లోగా 108 మందిని విధుల్లోకి తీసుకోవాలంటూ జీవీకే ఎంఆర్ఐ, ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తున్న సంస్థ‌ను ఆదేశిస్తూ తుది ఉత్త‌ర్వులు జారీ చేస్తూ జ‌డ్జిమెంట్ ఇచ్చారు. దీంతో 108 సిబ్బంది హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Latest News