Adipurush | ‘ఆదిపురుష్‌’ను వెంటాడుతున్న కష్టాలు.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌..!

Adipurush | ఆదిపురుష్‌ చిత్రానికి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే బాయ్‌కాట్‌ ఆదిపురుష్‌ పేరిట ట్రెండ్‌ చేస్తుండగా.. తాజాగా సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సినిమాను వక్రీకరించారంటూ హిందూసేన పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆదిపురుష్‌ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే, సినిమాపై తొలిరోజే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎక్కువగా నెగెటివ్‌ రివ్యూలు వస్తుండగా.. అక్కడక్కడ పాజిటివ్‌ రివ్యూలు సైతం వచ్చాయి. విడుదలకు ముందు నుంచి సినిమా కష్టాలు పడుతూ వస్తున్నది. […]

  • Publish Date - June 17, 2023 / 02:20 AM IST

Adipurush | ఆదిపురుష్‌ చిత్రానికి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే బాయ్‌కాట్‌ ఆదిపురుష్‌ పేరిట ట్రెండ్‌ చేస్తుండగా.. తాజాగా సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సినిమాను వక్రీకరించారంటూ హిందూసేన పిటిషన్‌ను దాఖలు చేసింది.

ఆదిపురుష్‌ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే, సినిమాపై తొలిరోజే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎక్కువగా నెగెటివ్‌ రివ్యూలు వస్తుండగా.. అక్కడక్కడ పాజిటివ్‌ రివ్యూలు సైతం వచ్చాయి.

విడుదలకు ముందు నుంచి సినిమా కష్టాలు పడుతూ వస్తున్నది. సినిమాపై నేపాలీలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ షోలు రద్దయ్యాయి. పలు హిందూ సంస్థలు సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఏకంగా కోర్టునే ఆశ్రయించాయి.

హిందుసేన చీఫ్‌ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భారతీయులకు శ్రీరాముడు, సీత మాత, హనుమంతుడి గురించి నిర్ధిష్టమైన ఆలోచన ఉందని.. అయితే, ఆదిపురుష్‌ సినిమాతో ఆ ఆలోచనను మార్చే ప్రయత్నం జరుతోందని ఆరోపించారు.

చిత్రంలోని సన్నివేశాలు హిందూ సంస్కృతిని అవమానించేలా ఉన్నాయని, దేవుళ్లను తప్పుగా చూపించే ప్రయత్నం జరిగిందని, ఇది హిందువుల హక్కులను ఉల్లంఘించడమేనని హిందుసేన చీఫ్‌ ఆరోపించారు. సినిమాలోని ఆయా పాత్రలకు సంబంధించిన దుస్తులతో పాటు, హెయిర్ స్టైల్, పర్సనాలిటీ, బాడీ షేప్‌కు సంబంధించి స్పష్టమైన సూచనలున్నాయని, ఆదిపురుష్‌లో వాటిని వక్రీకరించారని, ఇది హిందూ స్ఫూర్తిని దెబ్బతీసిందన్నారు. ఈ తప్పులను సరిదిద్దమని సినిమా నిర్మాత, దర్శకుడిని ఆదేశాలని కోర్టును కోరారు.

ఆదిపురుష్ ద్వారా చరిత్రను వక్రీకరించి బహిరంగంగా ప్రదర్శించడం మత స్వేచ్ఛకు, ఆచార స్వాతంత్య్రానికి విఘాతం కలిగిస్తోందన్న ఆయన ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. రామాయణంలోని అరణ్యకాండ, ఉత్తరకాండలను విభిన్నంగా తెరపైకి తీసుకువచ్చారని, ఇప్పటి వరకు చూసిన రావణ, వానర సేన, శ్రీరాముని వర్ణనలను విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశారని, దీన్ని చాలామంది హిందువులు జీర్ణించుకోలేరన్నారు.

రావణుడి సైన్యాన్ని రాక్షసుల సైన్యంగా, వానర సైన్యాన్ని చింపాంజీలుగా చూపించారంటూ ఆక్షేపించారు. ఇదిలా ఉండగా.. సినిమా విడుదల రోజే #బాయ్‌కాట్‌ఆదిపురుష్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండయ్యింది. సినిమాపై చాలా మంది తమ నిరసనను వ్యక్తం చేశారు. పలు సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Latest News