నేటి తరానికి తెలంగాణ విముక్తి చరిత్ర తెలియాలి: శ్యామ్

విధాత: భారత స్వాతంత్రోద్యమంతో పాటు నైజాం విముక్త తెలంగాణ స్వాతంత్య్ర ఉద్యమం గురించిన నిజమైన చరిత్రను నేటి తరం యువతకు అవగాహన కల్పించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సహధర్మా జాగరణ ప్రముఖ్ ఏలే శ్యామ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించిన నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల‌ యువ సమ్మేళనం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలు తమ చరిత్రను తెలుసుకున్నప్పుడే తాము […]

  • Publish Date - November 30, 2022 / 01:29 PM IST

విధాత: భారత స్వాతంత్రోద్యమంతో పాటు నైజాం విముక్త తెలంగాణ స్వాతంత్య్ర ఉద్యమం గురించిన నిజమైన చరిత్రను నేటి తరం యువతకు అవగాహన కల్పించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సహధర్మా జాగరణ ప్రముఖ్ ఏలే శ్యామ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించిన నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల‌ యువ సమ్మేళనం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ప్రజలు తమ చరిత్రను తెలుసుకున్నప్పుడే తాము గతంలో కోల్పోయిన స్వాతంత్య్ర పరిస్థితులను, అలాగే తిరిగి స్వాతంత్య్ర సాధనలో పోరాట యోధుల త్యాగాలు, ప్రజల కష్టాలను అర్థం చేసుకొని భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా జాగృతిలై ఉంటారన్నారు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన చరిత్రను తెలుసుకుంటే ఈ ప్రాంత ప్రజలు మళ్లీ ఆ తరహా పరిస్థితులు రాకుండా అవసరమైన చైతన్యాన్నిఅందుకుంటారని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం ల‌భించింద‌న్నారు. 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని గ్రామ గ్రామాన సెప్టెంబర్ 17, 2023న జాతీయ జెండాని ఎగరవేసి, నైజాం విముక్త చరిత్రను, ఉద్యమాన్ని ప్రజలందరికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కారిణి సభ్యులు అన్నదాన సుబ్రహ్మణ్యం, కురిమిల్ల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.