Site icon vidhaatha

Horticulture Officer Hall tickets | నేటి నుంచి హార్టికల్చర్‌ ఆఫీసర్‌ హాల్‌ టికెట్స్‌..! ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..?

Horticulture Officer Hall tickets | హార్టికల్చర్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష జరుగనున్నది. పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అందుబాటులో ఉంచింది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

పరీక్షకు సంబంధించిన గైడ్ లెన్స్, సూచనలు హాల్ టికెట్లపై ఉంటాయని పేర్కొంది. అభ్యర్థులు ప్రాక్టీస్‌ కోసం మాక్‌టెస్ట్‌ లింకును అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు మాక్‌ టెస్ట్‌లో పాల్గొని సూచించింది. ఇదిలా ఉండగా.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ పరిధిలోని హార్టికల్చర్‌ ఆఫీసర్‌ (Horticulture Officer) పోస్టుల నియామక పరీక్ష వాస్తవానికి ఏప్రిల్‌లో జరుగాల్సి ఉంది.

టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడడంతో హారికల్చర్‌ ఆఫీసర్‌ నియామక పరీక్షను రీషెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనున్నది.

ఇక పేపర్1-లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ‌స్‌పై ప్రశ్నలుంటాయి. పేపర్-2 లో హార్టికల్చర్ విభాగంలో ప్రశ్నలుంటాయి. 22 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ల పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌ 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 24 వరకు దరఖాస్తులు స్వీకరించింది.

హాల్‌ టికెట్లు ఎలా డౌన్‌ లోడ్‌ చేసుకోవాలంటే..

Exit mobile version