Site icon vidhaatha

Wine Festival | వైన్ ఫెస్టివ‌ల్ విత్ డ్రోన్స్.. ఆ క్రియేటివిటికి ఆల్క‌హాల్ ప్రియులు ఫిదా

Wine Festival |

వైన్ ఫెస్టివ‌ల్ అన‌గానే.. బార్లు, ప‌బ్బులు, రెస్టారెంట్లు గుర్తుకు వ‌స్తాయి. ర‌క‌ర‌కాల వైన్‌ను సేవించేందుకు ఆల్క‌హాల్ ప్రియులు ఇష్ట‌ప‌డుతుంటారు. అందుకుత‌గ్గ ఏర్పాట్లు చేస్తుంటారు నిర్వాహ‌కులు.

కానీ ఫ్రాన్స్‌లో మాత్రం వైన్ ఫెస్టివ‌ల్‌ను వినూత్నంగా నిర్వ‌హించారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా డ్రోన్ల‌తో వైన్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించి, ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించారు. ఆ క్రియేటివిటికి ఆల్క‌హాల్ ప్రియులు, నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

ఫ్రాన్స్‌లోని గారోన్ నది ఒడ్డున బోర్డిక్స్ వైన్ ఫెస్టివ‌ల్‌ను జూన్ 23, 24 తేదీల్లో నిర్వ‌హించారు. ఈ ఫెస్టివ‌ల్‌కు వేలాది మంది త‌ర‌లివ‌చ్చి ఎంజాయ్ చేశారు. ప్ర‌త్యేకంగా ఆకాశంలో అద్భుతం సృష్టించారు. డ్రోన్ల‌తో వైన్ ఫెస్టివ‌ల్‌కు సంబంధించిన వివిధ రకాల న‌మూనాల‌ను ప్ర‌ద‌ర్శించారు.

ఇందులో ప్ర‌ధానంగా ఓ క్రియేటివిటి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. మొద‌ట‌గా రెడ్ వైన్ బాటిల్‌ను డ్రోన్ల‌తో ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం స్టీమ్డ్ గ్లాస్‌ను ప్ర‌ద‌ర్శించి, వైన్‌ను దాంట్లో పోస్తున్న‌ట్లు సృష్టించారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ అద్భుత‌మైన క్రియేటివిటికి నెటిజ‌న్లు, ఆల్క‌హాల్ ప్రియులు ఫిదా అవుతున్నారు.

Exit mobile version