Site icon vidhaatha

KTR | వరద సాయం చేయడు.. బురద రాజకీయం చేస్తాడు: కిషన్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ నిప్పులు

KTR |

విధాత: హైద్రాబాద్‌లో వరదలోస్తే సాయం చేయడుగాని బురద రాజకీయం మాత్రం పక్కా చేస్తాడని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రశ్నోత్తరాల సమయంలో హైద్రాబాద్ ఎస్‌ఆర్‌డీపీ పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సమాధానమిస్తు ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. విశ్వనగరంగా హైద్రాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో ఎన్‌ఆర్‌డిపి మొదటి దశ కింద 35ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు పూర్తి చేశామన్నారు. ఇది తమ ప్రభుత్వ సమర్ధతకు నిదర్శనమన్నారు.

రాజేంద్ర‌నగర్‌, ఎల్‌బీనగర్‌, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, ఉప్పల్ లలో పనులు జరుగుతున్నాయన్నారు. ఉప్పల్‌, అంబర్ పేట ఫ్లై ఓవర్లు మోదీ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. కిషన్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని అంబర్‌పేట ఫ్లై ఓవర్‌ను పట్టించుకోలేదన్నారు.

190కోట్లతో 253ప్రాపర్టీలను రెండేళ్ల కింద పూర్తి చేసి వారి చేతుల్లో పెడితే నేటికి పనులు పూర్తి చేయలేదన్నారు. జీహెచ్‌ఎంసీ మంచినీళ్లు, కరెంటు వంటి వాటికి 37.86కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎస్‌ఆర్‌డీపీ రెండోదశ కూడా విజయవంతం చేస్తామని, మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు.

Exit mobile version