Site icon vidhaatha

Catherine Tresa | కేథరిన్ ట్రెసా: పెళ్లి చేసుకుంటున్నానంటే.. అలా అంటారేంటి?

Catherine Tresa |

అందానికే అందం అన్నట్లుగా ఉండే ఆకారం, నటనకు తగిన ఆహార్యం ఆమె సొంతం. ఇవే తనని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. హాట్ బ్యూటీగా వరుణ్ సందేశ్ ‘చమ్మక్ ఛల్లో’ మూవీలో నటించిన కేథరిన్ ట్రెసా.. అదే సమయంలో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రాన్ని కూడా చేసింది. అయితే వరుణ్ సినిమా కన్నా ముందు పూరీ ‘ఇద్దరమ్మాయిలతో’ విడుదలైంది. అదే కేథరిన్ నటించిన మొదటి చిత్రం అయింది.

ఆ సినిమా అంత విజయం అందుకోలేక పోయే సరికి అవకాశాలు రావని, కేథరిన్ కెరియర్‌కి ఫుల్ స్టాప్ పడిందనుకున్నారు. కానీ తన హాట్ లుక్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. తన మొదటి సినిమాతోనే చాలా ఆఫర్స్ అందుకుంది. ఇక ఇతర భాషలైన తమిళం, కన్నడ భాషల్లోనూ నటించిన కేథరిన్ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అటు హీరోయిన్‌గా కొనసాగుతూనే సెకండ్ హీరోయిన్‌గా కూడా చేసింది.

కాకపోతే.. ఆ నిర్ణయమే ఆమె కెరీర్‌ను పక్కదోవ పట్టేలా చేసింది. అంతే కాకుండా ఐటెం సాంగ్స్ కూడా చేసింది. ఇంకేముంది వరుసపెట్టి అన్నీ అలాంటి పాత్రలే వస్తాయనుకున్నారు. అయితే ఈ కష్టం ఊరికే పోలేదు. ఐటెం సాంగ్ చేయడంతో మంచి గుర్తింపునే సాధించుకుంది. ‘సరైనోడు, గౌతన్ నంద, నేనే రాజు నేనే మంత్రి, రుద్రమ దేవి’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ఈమధ్య కాలంలో కళ్యాణ్ రామ్ ‘బింబిసార’.. మెగాస్టార్, రవితేజల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల్లోనూ కనిపించింది. ప్రస్తుతం పలు మూవీస్‌తో బిజీగా ఉన్న కేథరిన్.. త్వరలోనే పెళ్ళి చేసుకోబోతుందట. అలా వార్తలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.

తన చిన్ననాటి స్నేహితుడితో కేథరిన్ క్లోజ్‌గా ఉంటుందని, పెద్దల్ని తమ పెళ్ళికి ఒప్పించి త్వరలోనే పెళ్ళి పీటలెక్కబోతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ విషయంలో కొందరు నెగిటివ్‌గా, కొందరు పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తుండటం విశేషం.

అయితే పెళ్ళీడు దాటిపోతున్నా హీరోయిన్స్ పెళ్ళి చేసుకోవడం లేదని గోల చేస్తుంటారు.. సరైన వయసుకే పెళ్లి చేసుకోబోతున్నా కూడా కొందరు.. సినిమాలు లేవుగా అందుకే అంటూ.. కామెంట్స్ చేయడం ఏమిటో అర్ధం కావడం లేదంటూ కేథరిన్ ఫ్యాన్స్ కొందరు సీరియస్ అవుతున్నారు. ‘ఏ ఈడుకు ఆ ముచ్చట’ అని ఊరికే అనలేదు. సినిమాలు లేక ఇబ్బందులు పడిపోతున్నా.. పెళ్ళిని వాయిదా వేస్తున్న చాలా మందికి కేథరిన్ ఆదర్శమే అని చెప్పుకోవాలి.

Exit mobile version