Site icon vidhaatha

KA PAUL | ఈ అడుక్కునే బతుకు మనకు అవసరమా.. నిన్ను స్టార్‌ను చేస్తా.. పార్టీని విలీనం చేయ్‌ పవన్‌

KA PAUL |

పవన్ కు కేఏ పాల్ ఆఫర్

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ మళ్ళీ లైన్లోకి వచ్చాడు. ఎప్పటి మాదిరిగానే పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. తన పార్టీలో జన సేనను విలీనం చేసి పార్టీకి అధికార ప్రతినిధిగా ఉంటూ పార్టీకి ప్రచారం చేయాలని సూచించారు.

పవన్ను తాను సూపర్ స్టార్ ను చేస్తానన్నారు. తనకు హాలీవుడ్‌లో ఏంజెలీనా జోలి, బ్రాడ్ పిట్ ఇంకా పెద్ద స్టార్లు తెలుసని, వారి రిఫరెన్స్ తో తాను పవన్ ను హాలీవుడ్ స్టార్ ను చేస్తానని అన్నారు.

ఈ అడుక్కునే బతుకు మనకు అవసరమా. నువ్వు బీజేపీని గెలిపించమని 100 జన్మలు ఎత్తినా ఓటు వేయరు. పవన్ నిన్ను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తాను అంటూ ఆఫర్ ఇచ్చారు.

అప్పట్లో చిరంజీవితో కలిసి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసావు. ఇప్పుడు నీ పార్టీని టిడిపి బిజెపి వాళ్ళకోసం ఎందుకు అమ్ముకుంటావు.

చంద్రబాబు.. మోడీ.. కేసీఆర్ వంటివాల్లకు నేను లిఫ్ట్ ఇచ్చాను.. నువ్వెల్లి వాళ్ళను ఎందుకు అడుక్కుంటావు.. నేనున్నాను.. నావెంట వచ్చేయ్ అని పాల్ పిలుపునిచ్చారు.

Exit mobile version