Site icon vidhaatha

Nandigama | మొదటి భార్య ఇన్‌స్టా రీల్స్ చూసిన భ‌ర్త‌.. మర్మాంగాలను కోసేసిన రెండో భార్య

Nandigama

విధాత: నందిగామలో దారుణం చోటు చేసుకుంది. తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రాం రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను రెండవ భార్య కోసేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నందిగామలోని అయ్యప్ప నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు తొలుత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత ఐదేళ్ల క్రితం వరమ్మ అనే మహిళను పెళ్లి చేసుకుని ముప్పాళ్ళలో నివాసం ఉంటున్నారు.

అయితే గత రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్‌స్టాగ్రాం వీడియోలు చూస్తుండగా.. వరమ్మకు తీవ్ర కోపం వచ్చింది. తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియో ఎందుకు చూస్తున్నావని ఆనంద్ బాబుపై మండిపడింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. దీంతో భర్త ఆనంద్ బాబుపై బ్లేడ్‌తో దాడి చేసి మర్మాంగాలను వరమ్మ కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి ఆనంద్ బాబును కుటుంబ సభ్యులు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అతడిని విజయవాడకు తీసుకెళ్లారు.

Exit mobile version