IND vs AUS | ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. మూడో టెస్టుకు కెప్టెన్‌ పాట్‌ కమ్మిన్స్‌ దూరం

IND vs AUS | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిపోయి కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు కెప్టెన్‌ పాన్‌ కమిన్స్‌ దూరమయ్యాడు. పాట్‌ కమ్మిన్స్‌ తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అయితే, ఆదివారం నాటికి భారత్‌కు రావాల్సి ఉంది. అయితే, అతని తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కొంతకాలం కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇక ఇండోర్‌లో […]

  • Publish Date - February 24, 2023 / 02:02 PM IST

IND vs AUS | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిపోయి కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు కెప్టెన్‌ పాన్‌ కమిన్స్‌ దూరమయ్యాడు. పాట్‌ కమ్మిన్స్‌ తల్లి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అయితే, ఆదివారం నాటికి భారత్‌కు రావాల్సి ఉంది. అయితే, అతని తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కొంతకాలం కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాడు.

ఈ క్రమంలో రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇక ఇండోర్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌కు స్టీవ్‌ స్మిత్‌ నాయకత్వం వహించనున్నాడు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున భారత్‌కు తిరిగి రాలేకపోతున్నా. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఉండడమే ఉత్తమమని నేను భావిస్తున్నా. మద్దతు ఇచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా, నా సహచరులకు ధన్యవాదాలు’ అని చెప్పాడు. ఇదిలా ఉండగా.. టెస్ట్‌ సిరీస్‌ అనంతరం జరిగే మూడు వన్డేల సిరీస్‌ జరుగనున్నది. ఈ సిరీస్‌కు సైతం కమ్మిన్స్‌నే క్రికెట్‌ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా నియమించింది.

మరి ఈ క్రమంలో వన్డే సిరీస్‌ కోసం భారత్‌కు వస్తాడో లేదో చూడాలి మరి. మరో వైపు గాయపడ్డ మిచెల్‌ స్టార్క్‌ కోలుకున్నాడు. ఇండోర్‌లో జరిగే టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాళ్లు పలు కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చారు. జోష్ హేజిల్‌వుడ్, డేవిడ్ వార్నర్, అష్టన్ అగర్ ఆస్ట్రేలియాకు వీరికి తోడు కెప్టెన్‌ సైతం స్వదేశానికి చేరుకున్నాడు.

Latest News