Site icon vidhaatha

India – Australia ODI | 19న విశాఖలో భారత్‌ – ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌.. 10 నుంచి టికెట్ల విక్రయాలు..

India – Australia ODI | బోర్డర్‌ – గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరుగనున్నది. ఈ మ్యాచ్‌ సంబంధించిన టికెట్లను ఈ నెల 10 నుంచి విక్రయించనున్నారు. 10న ఆన్‌లైన్‌లో విక్రయించనుండగా.. 13న ఆఫ్‌లైన్‌లో విక్రయించనున్నట్లు ఆంధ్రా క్రికెట్‌ సంఘం కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆఫ్‌లైన్‌లో మూడు కేంద్రాల్లో టికెట్లు విక్రయిస్తామన్న ఆయన.. ఎక్కడెక్కడ విక్రయిస్తామనే విషయాన్ని త్వరలో తెలుపుతామని చెప్పారు. భారత్‌ – ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లు పేటీఎంలోనూ అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇదిలా ఉండగా.. రెండు జట్ల మధ్య విశాఖలో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానున్నది. అయితే, మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల ధరలను రూ. 600, రూ.1500, రూ.2 వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.6వేలుగా నిర్ణయించారు.

Exit mobile version