INDIA | ముంబైలో ఆగ‌స్టు 25, 26 తేదీల్లో “ఇండియా” స‌మావేశం

INDIA శివ‌సేన ఉద్ద‌వ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌ నేతృత్వంలో నిర్వ‌హ‌ణ‌ విధాత‌: విప‌క్ష 26 పార్టీల కూట‌మి ఇండియా త‌దుప‌రి స‌మావేశం ముంబైలో వ‌చ్చే నెల 25, 26 తేదీల్లో జ‌రుగ‌నున్న‌ది. శివ‌సేన నేత ఉద్ద‌వ్ ఠాక్రే, నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శ‌ర‌ద్‌ప‌వార్ నేతృత్వంలో భేటీ నిర్వ‌హించ‌నున్నారు. ఈ సమావేశంలో కూటమి తన సమన్వయ కమిటీ, జాయింట్ సెక్రటేరియట్, ఇతర క‌మిటీల‌కు పేర్లు ఖరారు చేయాలని యోచిస్తున్నట్టు గతంలోనే విప‌క్ష నేత […]

  • Publish Date - July 28, 2023 / 01:15 AM IST

INDIA

  • శివ‌సేన ఉద్ద‌వ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌ నేతృత్వంలో నిర్వ‌హ‌ణ‌

విధాత‌: విప‌క్ష 26 పార్టీల కూట‌మి ఇండియా త‌దుప‌రి స‌మావేశం ముంబైలో వ‌చ్చే నెల 25, 26 తేదీల్లో జ‌రుగ‌నున్న‌ది. శివ‌సేన నేత ఉద్ద‌వ్ ఠాక్రే, నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శ‌ర‌ద్‌ప‌వార్ నేతృత్వంలో భేటీ నిర్వ‌హించ‌నున్నారు. ఈ సమావేశంలో కూటమి తన సమన్వయ కమిటీ, జాయింట్ సెక్రటేరియట్, ఇతర క‌మిటీల‌కు పేర్లు ఖరారు చేయాలని యోచిస్తున్నట్టు గతంలోనే విప‌క్ష నేత ఒక‌రు చెప్పారు.

అయితే, పార్ల‌మెంట్ స‌మావేశాల త‌ర్వాత తేదీల‌ నిర్వ‌హ‌ణ‌పై తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. ప్రచార‌, మీడియా, ఆందోళనల కోసం నియ‌మించే క‌మిటీల‌ను సబ్‌కమిటీలుగా పిలవకూడదని నిర్ణయించిన‌ట్టు, వాటికి భారత కమిటీల‌ను అని పేరు పెట్ట‌నున్న‌ట్టు ఒక సీనియర్ నాయకుడు చెప్పారు.

జూలై 18న బెంగళూరు నిర్వ‌హించిన సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. “ముంబైలో 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తాము. ప్ర‌చార‌ నిర్వహణ, ఉమ్మడిగా ఆందోళ‌న‌లు, కార్యాచరణ కోసం ఒక కేంద్ర సెక్రటేరియట్ కూడా ఏర్పాటు చేస్తామ‌ని, అది సెక్రటేరియట్ ఢిల్లీ నుంచి ప‌నిచేస్తున్న‌ది” అని వెల్ల‌డించారు.

ఈ సమన్వయ కమిటీ అన్ని పార్టీలకు ప్రతినిధిగా ఉంటుంద‌ని, ప్రతిపక్ష ఫ్రంట్‌లోని ఇతర అంశాలతో సహా ఎన్నికల్లో అనుస‌రించాల్సిన‌ రాజకీయ వ్యూహం, కమ్యూనికేషన్ పాయింట్లు, ఉమ్మడి ర్యాలీలు, సీట్ల పంపకం, భవిష్యత్తు కార్యాచ‌ర‌ణ‌ను నిర్ణ‌యిస్తుంద‌ని తెలిపారు. ముంబై సమావేశంలో ఫ్రంట్ అధ్యక్షుడిని, కన్వీనర్‌ను ఎన్నుకుంటామని కూడా అప్ప‌ట్లోనే ఖర్గే తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు 25, 26 తేదీల్లో జ‌రిగే ఇండియా స‌మావేశం విప‌క్ష పార్టీల‌కు కీల‌కంగా మార‌నున్న‌ది.

Latest News