విధాత: ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ (WWBC)లో భారత్ పసిడి పంట పండిస్తున్నది. ఇప్పటికే రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్న మన దేశం తాజాగా మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నది.
50 కిలోల విభాగంలో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ రెండు సార్లు ఆసియా ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న వియత్నాంకు చెందిన గుయెన్ మీద 5-0 తేడాతో విజయం సాధించి పసిడిని పట్టింది.
తద్వారా రెండో ప్రపంచ ఛాంపియన్ షిప్ తన ఖాతాలో వేసుకున్నది. దిగ్గజ మేరీ కోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిఖత్ రికార్డు సృష్టించింది.
గత ఏడాది 52 కిలోల విభాగంలో పసిడి దక్కించుకున్న నిఖత్ ఈసారి 50 కిలోల విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నది. శనివారం భారత్ రెండు స్వర్ణాలు సాధించిన సంగతి తెలిసిందే.
48 కేజీల విభాగంలో నీతూ గంగాస్ 5-0 తేడాతో లుత్సాయిఖాన్ (మంగోలియా)ను చిత్తుచేయగా.. 81 కిలోల విభాగంలో స్వీటీ 4-3తో వాంగ్ లీనా (చైనా)పై గెలిచింది.