Site icon vidhaatha

Vande Bharat | వంద్‌ భారత్‌లో సరికొత్త ఫీచర్స్‌..! ప్రయాణికులు కొత్త అనుభూతినిచ్చేలా..!

Vande Bharat | భారతీయ ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పు సరికొత్తగా సేవలు అందిస్తున్నది. వేగంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు, మంచి ప్రయాణ అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో వందే భారత్‌ రైళ్లు ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 30కిపైగా సెమీ హైస్పీడ్‌ రైళ్లను భారతీయ రైల్వే వివిధ మార్గాల్లో నడుపుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఒకేసారి దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య నడిచే తొమ్మిది వందే భారత్‌ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

అయితే, ఈ రైళ్లలో ప్రయాణికులకు మరికొన్ని ఫీచర్లు తీసుకువచ్చారు. గతంలో ఉన్న సౌకర్యాల కంటే మరింత ఆకర్షణీయంగా భారతీయ రైల్వే మార్చింది. ప్రయాణికుల వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ మేరకు కొత్తగా ప్రవేశపెట్టిన రైళ్లను ఫీచర్స్‌ను మార్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణను బట్టి అసరమైతే మరిన్ని మార్పులు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

కొత్తగా మార్పులు చేసిన ఇవే..

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రైళ్లలో అత్యాధునిక సౌకర్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ మేరకు పలు మార్పులు చేశారు. ఇందులో ప్రయాణికులు సీట్లను మరింతగా వెనక్కి ఒరిగి కూర్చునేందుకు వీలుగా రిక్లైనింగ్‌ యాంగిల్‌లో మార్పు చేశారు. సీట్‌ కుషన్‌ గట్టిగా ఉందని పలు ఫిర్యాదులు రావడంతో దాని ప్లేస్‌లో మొత్తటి కుషన్‌ను మార్చారు.

ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌ సీట్లు గతంలో తీసుకువచ్చిన రైళ్లలో ఎరుపురంగులో ఉండగా.. ప్రస్తుతం వాటిని నీలంరంగులోకి మార్చారు. ఫుట్ రెస్ట్‌ను మరింత పొడిగించారు. సీట్ల వెనక మ్యాగజైన్ బ్యాగ్‌ను ఏర్పాటు చేశారు. సీట్ల కింద మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌లోనూ స్వల్ప మార్పులు చేశారు. టాయిలెట్‌లో మంచి లైటింగ్ కోసం 2.5 వాట్ బల్బులు అమర్చగా.. వాష్ బేసిన్ సైజును పెంచారు.

వాటర్ ట్యాప్స్‌, టాయిలెట్ హ్యాండిల్స్‌లోనూ కొత్త డిజైన్‌లను తీసుకువచ్చారు. దివ్యాంగుల వీల్‌చైర్‌ను భద్రపరిచేందుకు ప్రత్యేకమైన పాయింట్లు ఏర్పాటు చేయగా.. లగేజ్ ర్యాక్ లైట్లకు మృదువైన టచ్ కంట్రోల్స్‌ను బిగించారు. ఏరోసోల్ ఫైర్ డిటెక్సన్ వ్యవస్థను మెరుగుపరిచారు. ప్రస్తుతం ఈ ఫీచర్స్‌ బాగున్నాయని పలువురు ప్రయాణికులు తెలిపారు. అయితే, ప్రయాణికుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాన్‌ను తీసుకొని మరిన్ని మార్పులు చేసేందుకు సైతం సిద్ధమేనని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version