Site icon vidhaatha

Indian Rocket | ఆ డబ్బా అప్పటి భారత రాకెట్ శకలం

Indian Rocket

విధాత‌: అంతర్జాతీయంగా పలు సందేహాలకు కారణమైవున్న ఇత్తడి డబ్బా ఏమిటి? మొన్న భారత్ ప్రయోగించిన చంద్రయాన్ తాలూకు రాకెట్ కానీ కూలిపోయిందా? ఏదైనా బాంబు పేలకుండా ఉండిపోయిందా? పోనీ ఏదైనా గ్రహాంతరజీవుల తాలూకా వాహనంలోని ముక్కా గట్రా ఇలా పడిందా అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. అది మనదే.. భారత దేశానికీ చెందిన రాకెట్ తాలూకూ ముక్కే.. కాకుంటే ఇరవయ్యేళ్ళ క్రిందటి రాకెట్ భాగం.

నిర్దేశించిన పని పూర్తయ్యాక హిందూమహా సముద్రంలో కూలిన అప్పర్ స్టేజి ఇంజిన్ పైడొప్ప. యూరోపియన్ అంతరిక్ష సంస్థ ఇంజినీరు ఆండ్రియా అభిప్రాయం. నిన్న రెడిటర్స్ చెప్పింది కూడా ఇదే. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఈ తరహా ‘అంతరిక్ష చెత్త’ పడటం మామూలే. 1979లో అమెరికా అంతరిక్ష కేంద్రం ‘స్కైలాబ్’ కూలిపోవడంతో దానికి సంబంధించిన ఓ పెద్ద శకలం పశ్చిమ ఆస్ట్రేలియాలో పడింది. తమ ప్రాంతంలో వ్యర్థాలు పడేసిన నేరానికి ‘నాసా’కు పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్పట్లో జరిమానా వేసింది. ‘నాసా’ దాన్ని పట్టించుకోలేదు. ‘నాసా’ తరఫున ఆ సొమ్మును ఓ రేడియో సంస్థ చెల్లించింది.

Exit mobile version