Site icon vidhaatha

Indraja | గుక్క‌ప‌ట్టి ఏడ్చిన ఇంద్ర‌జ‌.. ఆమెని చూసి మిగ‌తా వారు ఎమోష‌న‌ల్..!

Indraja |

ఒక‌ప్పుడు క‌థానాయిక‌లుగా స‌త్తా చాటిన భామ‌లు ఇప్పుడు సపోర్టింగ్ పాత్ర‌ల‌లో అద‌ర‌గొడుతున్న విష‌యం తెలిసిందే. కొంద‌రు వెండితెర‌పై స‌త్తా చాటుతుండగా, మ‌రి కొంద‌రు బుల్లితెర‌పై త‌మ హవా చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో అల‌నాటి అందాల హీరోయిన్ ఇంద్ర‌జ ఇప్పుడు సినిమాలు చేస్తూనే బుల్లితెర‌పై కూడా ర‌చ్చ చేస్తుంది. రోజా రాజ‌కీయాల‌లోకి వెళ్లిన త‌ర్వాత మ‌ల్లెమాల నిర్వాహ‌కులు ఇంద్ర‌జ‌నే మెయిన్ ఆప్ష‌న్‌గా పెట్టుకున్నారు.

జ‌బ‌ర్ధస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఏదైన స్పెష‌ల్ ఈవెంట్స్ ఉంటే అందులో ఇంద్ర‌జ త‌ప్ప‌నిసరిగా మారింది. ఇంద్రజ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎంత కమిట్మెంట్ తో పనిచేసేదో ఇప్పుడు తాను చేసే ప్రతి షో కి అలాగే పని చేస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ స‌క్సెస్‌లో కీలక పాత్ర పోషించేందుకు ఇంద్ర‌జ ఎంత‌గానో ప్ర‌య‌త్నం చేస్తుంది.

రీసెంట్‌గా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించి ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్ ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో ఎప్ప‌టి మాదిరిగానే ఆటో రాం ప్ర‌సాద్, ఆది పంచ్‌ల‌తో సంద‌డి చేయ‌గా, ఇంద్ర‌జ త‌న క్లాసిక్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టింది. క్లాసికల్ డాన్స్ అనుభవం ఉన్న ఇంద్రజ.. చాలా ఏళ్ళ తర్వాత ఇలా క్లాసికల్ డాన్స్ చేసే అవ‌కాశం త‌న‌కి ద‌క్కింద‌ని చెబుతూ గుక్క‌ ప‌ట్టి ఏడ్చింది. తాను క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు చాలా ఆనందం పొందిన‌ట్టు చెప్పిన ఇంద్ర‌జ‌.. ఎందుకు ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యానని అంటూ కంటతడి పెట్టుకొని.. ఏడ్చేసింది.

ఇంద్ర‌జ చాలా ఎమోష‌న‌ల్ అవుతుండ‌డంతో అక్క‌డే యాంకర్ రష్మీతో పాటు .. మిగతా వారు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రోమో చూసిన వారు సైతం ఇంద్ర‌జ డ్యాన్స్ ప‌ర్‌ఫార్మెన్స్ ని మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు. లేటు వ‌యస్సులో ఇంద్ర‌జ ఓ ఊపు ఊపేస్తుంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి దూర‌మైన ఇంద్ర‌జ ఇప్పుడు.. బుల్లితెర‌ షోల పుణ్యమా అని సినిమాల‌లో కూడా మంచి మంచి అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. ఇక చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని వినియోగించుకుంటుంది. ప్రస్తుతం బుల్లితెర మీద బిజీగా ఉన్న ఇంద్రజ రానున్న రోజుల‌లో టాలీవుడ్ హీరోలకు అమ్మగా కనిపించిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అని
అంటున్నారు.

Exit mobile version