Site icon vidhaatha

Credit Card | క్రెడిట్‌ కార్డులతో ఆ లోన్లు చెల్లించండం ఇక కుదరదు..! కారణం ఏంటంటే..?

Credit Card |

ప్రస్తుతం క్రిడెట్‌ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. అన్నింటికి ఆ కార్డులతోనే చెల్లింపులు చేస్తున్నారు. క్రిడెట్‌ కార్డుతో బిల్లులు చెల్లిస్తే.. తిరిగి చెల్లించేందుకు 40 రోజుల వరకు సమయం ఉండడంతో ఎక్కువగా వాటినే వినియోగిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో భారతీయ బీమా నియంత్రణ మండలి (IRDAI) కీలక నిర్ణయం తీసుకున్నది.

బీమా పాలసీలపై తీసుకున్న లోన్లను క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లించడం ఇకపై సాధ్యం కాదని స్పష్టం చేసింది. పాలసీలపై రుణం లోన్‌ తీసుకుంటే.. వాటిని క్రెడిట్‌ కార్డుల ద్వారా తిరిగి చెల్లించే విధానాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ మేరకు జీవిత బీమా సంస్థలన్నింటిని క్రెడిట్‌ కార్డు ద్వారా రుణాల చెల్లింపును అనుమతించొద్దని సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని బీమా నియంత్రణం మండలి స్పష్టం చేసింది. ఎన్‌పీఎస్‌ టైర్‌-II ఖాతాల సబ్‌స్క్రిప్షన్‌, వాటిలో చందా జమ చేయడాన్ని సైతం క్రెడిట్‌ కార్డులను అమనుమతించ బోమంటూ 2022 ఆగస్ట్‌లో పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) తెలిపింది.

అయితే, క్రెడిట్‌ కార్డు ద్వారా బకాయిలు చెల్లిస్తే.. వాటిని తిరిగి చెల్లించేందుకు నెల వడ్డీ లేకుండా సమయం ఉంటుంది. అయితే, పాలసీదారులు ఆయా క్రెడిట్‌ కార్డుల బిల్లులు సకాలంలో చెల్లించని పక్షంలో వాటిపై వడ్డీభారం విపరీతంగా పెరుగుతుంది. దాంతో ఆర్థిక కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని బీమారంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో బీమా పాలసీపై తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు క్రెడిట్‌ కార్డులను అనుమతించడం లేదని వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 2023 జనవరి చివరి నాటికి వివిధ బ్యాంకుల ద్వారా 8.25కోట్ల క్రెడిట్‌కార్డులు జారీ అయ్యాయని అంచనా.

Exit mobile version