China |
- సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్‌లు.. ఆన్‌లైన్ గేమ్‌లకు దెబ్బ
విధాత: చైనాలోని సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ తన సైట్‌లో మైనర్ పిల్లల మొబైల్ ఇంటర్నెట్ వినియోగంపై కొత్త మార్గదర్శకాల డ్రాఫ్ట్‌ను జారీ చేసింది. సవరించిన నూతన మార్గదర్శకాలను అనుసరించి 8 మరియు 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు ఒక గంట మాత్రమే ఇంటర్నేట్ అనుమతించబడుతుంది.
8 ఏళ్లలోపు వారికి 40 నిమిషాలు మాత్రమే అనుమతించబడుతుంది. మైనర్లకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6గంటల వరకు మొబైల్ పరికరాలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఉపయోగించడానికి అనుమతి లేదని పేర్కొంది.
16 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్‌ని ఉపయోగించాలని నిర్ధేశించింది. అయితే మైనర్‌ల శారీరక, మానసిక అభివృద్ధికి తగిన యాప్‌లు, ప్లాట్‌ఫారమ్‌ల వంటి నిర్దిష్ట సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని పేర్కోంది.
ఏ ఇంటర్నెట్ సేవలకు మినహాయింపులు అనుమతించబడతాయో సీఏసీ పేర్కొనలేదు. యువతను ఇంటర్నెట్ వ్యసనం నుంచి, అవాంఛనీయ సమాచారం ప్రభావానికి లోను కాకుండా తాజాగా నూతన నిర్ణయాలు తీసుకుంటున్నటుగా సీఏసీ తెలిపింది. పిల్లలో ఇంటర్నేట్ వినియోగం నియంత్రణకు 2019లో బీజింగ్ పిల్లల రోజువారీ ఆన్‌లైన్ గేమ్ సమయాన్ని రోజుకు 90 నిమిషాలకు చైనా పరిమితం చేసింది. 2021లో ఆ పరిమితులను కఠినతరం చేసింది.
శుక్రవారాలు, వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాల్లో పిల్లలు రోజుకు ఒక గంట మాత్రమే ఆన్‌లైన్ గేమ్ ఆడేందుకు అనుమతించారు. మైనర్‌ల ఆన్‌లైన్ రక్షణను సమర్థవంతంగా బలోపేతం చేయడానికి, సీఏసీ ఇటీవలి సంవత్సరాలలో ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లలో యూత్ మోడ్‌ను స్థాపించడం, దాని కవరేజీని విస్తరించడం, దాని విధులను ఆప్టిమైజ్ చేయడం, వయస్సుకి తగిన కంటెంట్‌తో నియంత్రణ చేయడం కోసం చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించింది.
డౌయిన్, బిలిబిలి, కుయిషౌ వంటి షార్ట్-వీడియో, ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లు, మైనర్‌లకు చూపబడే కంటెంట్ రకాన్ని, వాటిని చూసే సమయాన్ని పరిమితం చేసే యూత్ మోడ్‌లను అందించాయి. పిల్లలు సైన్స్ ప్రయోగాలు వంటి విద్యా కంటెంట్‌ను కూడా పెట్టారు.
కాగా సీఏసీ తాజా నిర్ణయంతో చైనాలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లను నడుపుతున్న టెన్సెంట్బై, బైట్‌డాన్స్ వంటి సంస్థలకు దెబ్బగా భావిస్తున్నారు. అయితే సీఏసీ ముసాయిదా మార్గదర్శకా లు సెప్టెంబర్ 2 వరకు పబ్లిక్ ఫీడ్‌బ్యాక్‌కు తెరిచి ఉంటాయని తెలిపింది. కొత్త నిబంధనలు ఎప్పుడు అమలులోకి వస్తాయో మాత్రం స్పష్టం చేయలేదు.