ప్రస్తుతం భారతీయులను కలవర పెడుతున్న 3 అంశాలివే..

విధాత: నిరుద్యోగం లేకుండా, ఆర్థికంగా బలపడి, రాజకీయ అవినీతి లేకుండా ఉంటే ఏ దేశమైనా అభివృద్ధి బాటలో పయనిస్తోంది. కానీ భారత్‌లో ఈ మూడు అంశాల పట్లనే ఎక్కువగా కలవరం చెందుతున్నారట. అది కూడా పట్టణ ప్రాంత భారతీయులని వాట్ వర్రీస్ ది వరల్డ్ పేరిట ఇప్సోస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. 10 మందిలో ఇద్దరు ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో తేలిందట. ఆన్ లైన్ వేదికగా సెప్టెంబర్ 23 […]

  • Publish Date - November 1, 2022 / 02:55 PM IST

విధాత: నిరుద్యోగం లేకుండా, ఆర్థికంగా బలపడి, రాజకీయ అవినీతి లేకుండా ఉంటే ఏ దేశమైనా అభివృద్ధి బాటలో పయనిస్తోంది. కానీ భారత్‌లో ఈ మూడు అంశాల పట్లనే ఎక్కువగా కలవరం చెందుతున్నారట. అది కూడా పట్టణ ప్రాంత భారతీయులని వాట్ వర్రీస్ ది వరల్డ్ పేరిట ఇప్సోస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి.

10 మందిలో ఇద్దరు ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో తేలిందట. ఆన్ లైన్ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7వ తేదీ మధ్యలో ఈ సర్వేను నిర్వహించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న సామాజిక, రాజకీయ అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు.

చాలా మంది ద్రవ్యోల్బణం గురించి ఎక్కువగా కలవరపడుతున్నారు. ఇది గత నెలతో పోల్చుకుంటే రెండు శాతం పెరిగినట్లు సర్వేలో తేలింది. దీంతో పాటు పేదరికం, అసమానతలు, నిరుద్యోగం, హింస, నేరాలు, ఆర్థిక, రాజకీయ అవినీతి వంటి అంశాలు కూడా భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నట్లు వెల్లడైంది.

ఈసందర్భంగా ఇప్సోస్ ఇండియా సీఈవో అమిత్ అడార్కర్ మాట్లాడుతూ..29 దేశాల్లో సర్వే నిర్వహించగా, ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందుతున్న ఆ దేశాల జాబితాలో భారత్ చివరి స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్, ఉక్రెయిన్ సంక్షోభం వంటి ప్రభావాలు భారత్ పై ఉన్నట్లు తెలిపారు.

వాతావరణ మార్పులపై పట్టణవాసులు ఎక్కువగా ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈ అంశాలపై భారత ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉందన్నారు. తమ దేశం సరైన మార్గంలో ప్రయాణిస్తుందని 76 శాతం మంది పట్టణవాసులు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు.

Latest News