IRCTC Tour Package | దక్షిణ భారతదేశంలోని ఆలయాల సందర్శనకు వెళ్లాలనుకుంటున్నారా..? మీ కోసమే ఐఆర్‌సీటీసీ ‘సౌత్‌ ఇండియా టెంపుల్‌ రన్‌’ స్పెషల్‌ ఎయిర్‌ ప్యాకేజీ..!

IRCTC Tour Package | పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ మరో ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకునేందుకు ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నది. సౌత్ ఇండియా టెంపుల్ రన్ (South India Temple Run) పేరిట తీసుకువచ్చిన ప్యాకేజీలో పర్యటన విమానంలో సాగనున్నది. ప్యాకేజీలో కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తిరుచ్చిరాపల్లి, త్రివేండ్రం సందర్శింవచ్చు. ఆరు రాత్రులు, ఏడు రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. […]

  • Publish Date - August 4, 2023 / 02:15 AM IST

IRCTC Tour Package | పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ మరో ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకునేందుకు ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నది.

సౌత్ ఇండియా టెంపుల్ రన్ (South India Temple Run) పేరిట తీసుకువచ్చిన ప్యాకేజీలో పర్యటన విమానంలో సాగనున్నది. ప్యాకేజీలో కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తిరుచ్చిరాపల్లి, త్రివేండ్రం సందర్శింవచ్చు. ఆరు రాత్రులు, ఏడు రోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. ఆగస్టు 13న ప్యాకేజీ టూర్ మొదలవుతుంది.

టూర్‌ ఇలా..

Day 1 : ఐఆర్‌సీటీసీ ‘సౌత్ ఇండియా టెంపుల్ రన్’ పర్యటన తొలిరోజు హైదరాబాద్‌లో మొదలవుతుంది. ఉదయం 5.15 గంటలకు హైదరాబాద్‌లో విమానం ఎక్కాల్సి ఉంటుంది. ఆ తర్వాత 6.50 గంటలకు త్రివేండ్రం చేరుకుంటారు. అక్కడ హోటల్‌లోకి చెకిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం నేపియర్ మ్యూజియం, పూవర్ ఐల్యాండ్, అజిమల శివాలయం సందర్శనకు వెళ్తారు. రాత్రికి త్రివేండ్రంలోనే బస చేస్తారు.

Day 2 : రెండోరోజు ఉదయం అనంత పద్మనాభస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం కన్యాకుమారికి బయలుదేరి వెళ్తారు. కన్యాకుమారి చేరుకున్నాక సాయంత్రం సన్‌సెట్ పాయింట్‌లో సూర్యాస్తమయాన్ని వీక్షిస్తారు. ఇక రాత్రికి కన్యాకుమారిలో బస ఉంటుంది.

Day 3 : మూడో రోజు ఉదయం రాక్ మెమోరియల్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత రామేశ్వరం బయలుదేరాల్సి ఉంటుంది. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి.

Day 4 : నాలుగో రోజు రామేశ్వరం స్థానిక ఆలయాల దర్శనం ఉంటుంది. అనంతరం ధనుష్కోడికి వెళ్లాలి. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి.

Day 5 : ఐదో రోజు రామేశ్వరంలో అబ్దుల్ కలాం మెమొరియల్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత తంజావూర్ బయలుదేరి వెళ్తారు. అక్కడ బృహదీశ్వర ఆలయ దర్శనం ఉంటుంది. అనంతరం తిరుచ్చి వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు.

Day 6 : ఆరో రోజు ఉదయం శ్రీరంగం ఆలయ సందర్శన ఉంటుంది. దర్శనం తర్వాత మదురై బయల్దేరాలి. రాత్రికి మదురైలో బస చేస్తారు.

Day 7 : ఏడో రోజు ఉదయం మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఉంటుంది. దర్శనం ముగిసిన తర్వాత మదురై నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మదురైలో రాత్రి 6.50 గంటలకు విమానం ఎక్కితే రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దాంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ధర ఎంతంటే..?

ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ఒక్కొక్కరికి ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.32,250 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.34వేలు, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.47వేలు చెల్లించాల్సి ఉంటుంది. టూర్ ప్యాకేజీలో విమానం టికెట్స్‌, హోటల్‌లో బస, ఏసీ వాహనంలో సైట్‌ సీయింగ్‌, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కవర్‌ అవుతాయి.

సౌత్‌ ఇండియా టెంపుల్ రన్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకునేందుకు http://www.irctctourism.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో Tour Packages క్లిక్‌ చేసి, SOUTH INDIA TEMPLE RUN లింక్ క్లిక్‌ చేసి.. ఆ తర్వాత టూర్ ప్యాకేజీ వివరాలన్నీ చెక్ చేసుకొని లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు.

Latest News