Aditya L1 | నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1..

న‌మ్మ‌కం నిల‌బెట్టుకున్న ఇస్రో విజ‌యాశ్వం పీఎస్ఎల్వీ గంట‌న్న‌ర త‌ర్వాత అత్యున్న‌త క‌క్ష్య‌లోకి ఉప‌గ్ర‌హం Aditya L1 | విధాత‌: భార‌త తొలి సౌర ఉప‌గ్ర‌హం ఆదిత్య ఎల్ 1 (Aditya L1) ను ఇస్రో (ISRO) విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. శ‌నివారం ఉదయం 11:50 గంట‌ల‌కు ఇస్రో విజ‌యాశ్వం పీఎస్ఎల్వీ.. ఆదిత్య ఎల్ 1 ఉప‌గ్ర‌హంతో నింగిలోకి దూసుకెళ్లింది. అనంత‌రం 63 నిమిషాల త‌ర్వాత ఉప‌గ్ర‌హం రాకెట్ నుంచి విడిపోయే ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఆ సమ‌యానికి భూమికి […]

  • Publish Date - September 2, 2023 / 07:14 AM IST

  • న‌మ్మ‌కం నిల‌బెట్టుకున్న ఇస్రో విజ‌యాశ్వం పీఎస్ఎల్వీ
  • గంట‌న్న‌ర త‌ర్వాత అత్యున్న‌త క‌క్ష్య‌లోకి ఉప‌గ్ర‌హం

Aditya L1 | విధాత‌: భార‌త తొలి సౌర ఉప‌గ్ర‌హం ఆదిత్య ఎల్ 1 (Aditya L1) ను ఇస్రో (ISRO) విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. శ‌నివారం ఉదయం 11:50 గంట‌ల‌కు ఇస్రో విజ‌యాశ్వం పీఎస్ఎల్వీ.. ఆదిత్య ఎల్ 1 ఉప‌గ్ర‌హంతో నింగిలోకి దూసుకెళ్లింది. అనంత‌రం 63 నిమిషాల త‌ర్వాత ఉప‌గ్ర‌హం రాకెట్ నుంచి విడిపోయే ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఆ సమ‌యానికి భూమికి అత్యంత ఎత్తైన క‌క్ష్య‌లోకి ఉప‌గ్ర‌హం చేరుకుంటుంది.

అనంత‌రం అదే క‌క్ష్య‌లో ఆదిత్య ఎల్ 1.. 16 రోజుల పాటు ప‌రిభ్ర‌మిస్తుంది. కావాల్సిన గ‌తి వేగాన్ని పుణికి పుచ్చుకున్న అనంత‌రం..సూర్యుని వైపు త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తుంది. అలా ఇది 110 రోజుల పాటు విశ్వంలో ప్ర‌యాణించి.. భూమికి 15 ల‌క్ష‌ల కి.మీ. దూరంలో ఉన్న ఎల్ 1 పాయింట్ వ‌ద్ద స్థిరంగా కొన‌సాగుతుంది. అయితే ఈ దూరం.. భూమికి సూర్యునికి మ‌ధ్య దూరంతో పోల్చితే ఒక శాతం మాత్ర‌మే.

సూర్యుని చుట్టూ ఉండే క‌రోనా, సూర్యుని ఉప‌రిత‌ల ఉష్ణోగ్ర‌త‌, సౌర తుపానుల రాక‌, అంత‌రిక్ష వాతావ‌ర‌ణం మొద‌లైన అంశాల‌పై ఆదిత్య ఎల్‌1 లో ఉండే పే లోడ్‌లు ప‌రిశోధ‌న సాగిస్తాయి. గ్ర‌హ‌ణాలు వ‌చ్చినా ప‌రిశోధ‌న‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా ఉండేందుకే ఎల్ 1 పాయింట్ ద‌గ్గ‌ర ఆదిత్య ఎల్‌1ను ఉంచ‌డానికి నిర్ణ‌యించామ‌ని ఇస్రో పేర్కొంది.

Latest News