Jagapathi Babu
విధాత: రజనీకాంత్ నిజాలే మాట్లాడతారని అన్నారు విలక్షణ నటుడు జగపతిబాబు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రామబాణం’. గోపీచంద్, డింపుల్ హయాతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం మే 5న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈలోపు చిత్రాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.
తాజాగా జగపతిబాబు ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీసెంట్‌గా రజనీకాంత్‌పై జరుగుతున్న కాంట్రవర్సీకి సంబంధించి మాట్లాడాలని మీడియా ఆయనని కోరింది. రజనీకాంత్ గురించి జగ్గు భాయ్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
దాంతో ఆయనపై వైసీపీ నేతలు మాటల దాడికి దిగారు. నటి సిల్క్ స్మిత మరణానికి కారణం సూపర్ స్టార్ అంటూ దూషణకు దిగడంతో.. ఆయన ఫ్యాన్స్, చంద్రబాబు అండ్ టీమ్ ఫైర్ అవుతూ.. వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలా ఈ గొడవ ఇంకా నడుస్తూనే ఉంది. ఇక రజనీకాంత్ స్నేహితులలో జగపతిబాబు కూడా ఒకరు. వీరిద్దరూ కలిసి ‘కథానాయకుడు’ అనే చిత్రంలో స్నేహితులుగా నటించారు. రజనీకాంత్ ఇందులో సూపర్ స్టార్ గానే నటించగా.. జగపతిబాబు మాత్రం రజనీ రియల్ లైఫ్ స్నేహితుడి పాత్రను పోషించారు. ఆ చనువుతో ఇప్పుడు మీడియా ఆయనని రజనీకాంత్ కాంట్రవర్సీ గురించి మాట్లాడాలని కోరింది.
అంటే చంద్రబాబు గురించి జగపతిబాబు మాట్లాడిందంతా నిజమే అని జగపతిబాబు కూడా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ టార్గెట్ జగపతిబాబు అయ్యే అవకాశం లేకపోలేదు.
సినిమా విడుదలకు ముందు ఇలాంటి కాంట్రవర్సీలు ఎందుకని కామ్‌గా ఉండకుండా.. ఫ్రెండ్ కోసం, ఫ్రెండ్ తరపున మాట్లాడి.. ‘రామబాణం’కు లేనిపోని తలనొప్పులు జగ్గుభాయ్ తెచ్చిపెట్టాడని కొందరు నెటిజన్లు అంటుంటే, జగ్గుభాయ్ కూడా రజనీ టైపే.. ముక్కుసూటిగా మాట్లాడేస్తాడంటూ మరికొందరు నెటిజన్లు ఆయనని ప్రశంసిస్తున్నారు.