Gopichand
టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ తెరపైకి వచ్చింది. గతంలో ఘాజీ, అంతరిక్షం, ఐబీ71 వంటీ కాన్పెప్ట్ చిత్రాలతో టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి, మ్యాచో స్టార్ గోపీచంద్ కలిసి సినిమా చేయనున్నారు.
వరుస పరాజయాల తర్వాత విశ్వం చిత్రం విజయంతో కాస్త రిలాక్స్‌గా ఉన్న గోపీచంద్ తన రాబోవు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇప్పటికే జిల్ , రాధేశ్యాం ఫేం రాధా కృష్ణ డైరెక్షన్‌లో చేయాల్సిన చిత్రం ఆగి పోగా ఈ క్రమంలోనే ఈ రేర్ కాంబో రెడీ అయింది. సంకల్ప్ చెప్పిన స్టోరీ గోపీచంద్‌కు బాగా నచ్చిందని సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమచారం.
చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తోండగా సినిమాకు సంబంధించిన విషయాలు, టెక్నీషియన్స్ వివరాలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.