Site icon vidhaatha

Jantar Mantar | జంతర్ మంతర్ వద్ధ బీసీ సంక్షేమ సంఘం ధర్నా

Jantar Mantar |

విధాత: జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో బీసీలకు 50శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని, జాతీయ జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది.

ధర్నాలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గండి చెర్వు వెంకన్న గౌడ్ మాట్లాడుతు కేంద్రంలో ప్రధాన మోడీ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం తక్షణమే తమ డిమాండ్లను ఆమోదించాలని కోరారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురగోని రాంబాబు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదగోని మహేష్ కుమార్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాదగోని నరేందర్ గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నేరటి మల్లేష్ యాదవ్, జిల్లా నాయకులు అక్కెనపల్లి సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version