Jawan
విధాత: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జవాన్’. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గురువారం (సెప్టెంబర్ 7).. హిందీ, తమిళ్, తెలుగులో భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర హిస్టరీని క్రియేట్ చేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్’ ఫస్ట్ డే రూ. 129.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో హిందీ చలన చిత్ర చరిత్రలో సరికొత్త సెన్సేషన్‌ను ‘జవాన్’ క్రియేట్ చేశాడు. కొన్నాళ్లుగా బాలీవుడ్ పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన విషయం తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ స్టార్ హీరో అయిన షారుఖ్ మళ్లీ రంగంలోకి దిగక తప్పలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో బాలీవుడ్ పరువు నిలపడమే కాకుండా.. బాలీవుడ్‌లో హీరోలలో స్ఫూర్తి నింపాడు. ప్రస్తుతం అక్కడ కూడా మంచి విజయాలే పడుతున్నాయి.
As Jawan says, "Yeh toh bas shuruaat hai"