Allu Arjun | అల్లు అర్జున్‌పై చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకున్న కావేరీ బారువా.. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో…

Allu Arjun | టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే. ఓ వాణిజ్య ప్రకటనలో నటించే నటి, మోడల్ కావేరీ బారువా ఆయనపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్‌ను కలిసే సమయంలో పాటించాల్సిన 42 నిబంధనలు ఇలా ఉన్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

Allu Arjun | టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే. ఓ వాణిజ్య ప్రకటనలో నటించే నటి, మోడల్ కావేరీ బారువా ఆయనపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్‌ను కలిసే సమయంలో పాటించాల్సిన 42 నిబంధనలు ఇలా ఉన్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ టీమ్ వెంటనే స్పందించి, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అయితే రెండు రోజులకే సోషల్ మీడియాలో “అల్లు అర్జున్‌ను కలవాలంటే పాటించాల్సిన 42 రూల్స్” అంటూ ఓ నోట్ వైరల్ అవ్వడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఈ లిస్టును యాంటీ ఫ్యాన్స్ ఆయుధంలా ఉపయోగించుకుని ప్రతి రూల్‌ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.

అయితే తాజాగా ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. కావేరీ బారువా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా స్పందిస్తూ అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆమె మాట్లాడుతూ .. “గత కొన్ని రోజులుగా నా పోడ్కాస్ట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నేను అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు తప్పుగా వెళ్లాయి. బహుశా అలా మాట్లాడటం కూడా తప్పేనని ఇప్పుడు అనిపిస్తోంది” అని పేర్కొంది.

అల్లు అర్జున్‌తో యాడ్ షూట్ సమయంలో పాటించాల్సిన 42 నియమాలు, అలాగే ఆయన టీమ్ గురించి మాట్లాడిన విషయాలు ఆధారాలు లేకుండా చెప్పడం సరైంది కాదని ఆమె అంగీకరించింది. తన వ్యాఖ్యలు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని తెలుసుకున్నానని, అందుకే వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది.

అయితే ఆమె క్షమాపణలపై కూడా సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ ఈ క్షమాపణలు స్వచ్ఛందంగా చెప్పిన‌వి కాదని, బలవంతంగా చెప్పించినట్టుగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం క్షమాపణ చెప్పి ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆమె చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.ఏదేమైనా, ఈ వివాదానికి కావేరీ బారువా అధికారిక క్షమాపణలతో ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో రోజురోజుకు పెరుగుతున్న ట్రోలింగ్ సంస్కృతిలో, ఇటువంటి సంఘటనలు ఎంత వేగంగా పెద్ద ఇష్యూలుగా మారుతున్నాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Latest News