Jitta Balakrishna Reddy | కిష‌న్ రెడ్డి పచ్చి స‌మైక్య‌వాది.. జిట్టా బాల‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Jitta Balakrishna Reddy విధాత‌: రేపోమాపో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న జిట్టా బాల‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కిష‌న్ రెడ్డి పచ్చి స‌మైక్య‌వాది అని ధ్వ‌జ‌మెత్తారు. పార్టీలో మ‌రో నాయ‌కుడు ఎద‌గొద్ద‌నేది కిష‌న్ రెడ్డి ఆలోచ‌న అని దుయ్య‌బ‌ట్టారు. ఎన్నికల తర్వాత ఇతర పార్టీలను చీల్చి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి వ‌రించింద‌ని పేర్కొన్నారు. భద్రాచలం రాముడి గుడిని […]

  • Publish Date - July 29, 2023 / 01:56 AM IST

Jitta Balakrishna Reddy

విధాత‌: రేపోమాపో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న జిట్టా బాల‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కిష‌న్ రెడ్డి పచ్చి స‌మైక్య‌వాది అని ధ్వ‌జ‌మెత్తారు. పార్టీలో మ‌రో నాయ‌కుడు ఎద‌గొద్ద‌నేది కిష‌న్ రెడ్డి ఆలోచ‌న అని దుయ్య‌బ‌ట్టారు.

ఎన్నికల తర్వాత ఇతర పార్టీలను చీల్చి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి వ‌రించింద‌ని పేర్కొన్నారు. భద్రాచలం రాముడి గుడిని అభివృద్ధికి చేయలేని సిగ్గు శరం లేని మంత్రి కిషన్ రెడ్డి అని జిట్టా నిప్పులు చెరిగారు.

బీజేపీని బలోపేతం చేసిన బండి సంజయ్‌ను కుట్ర‌లో భాగంగా అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించార‌ని జిట్టా పేర్కొన్నారు. మీడియాకు లీకులిచ్చి.. స్వయంగా ఈటల రాజేందర్ బీజేపీని బలహీన పరిచాడని ధ్వ‌జ‌మెత్తారు.

అమిత్ షా, జేపీ నడ్డాలను తిట్టిన రఘునందనరావును కిషన్ రెడ్డి సంకలో పెట్టుకుని తిరుగుతున్నాడని ఘాటుగా వ్యాఖ్యానించారు. నన్ను సస్పెండ్ చేసేకంటే ముందు రఘునందనరావు, ఈటల రాజేంద‌ర్, ఏ.చంద్రశేఖర్, రవీందర్ నాయక్ లను సస్పెండ్ చేయాలని జిట్టా బాల‌కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ విషయంలో మోదీ, అమిత్ షాలు కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. కేసీఆర్‌తో ఒప్పందంలో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని మునుగోడులో బలిపశువును చేశారని వాపోయారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవిత లిక్కర్ స్కాం కేసు నిర్వీర్యమైంద‌న్నారు.

మూడు పర్యాయాలు పార్టీని నిర్వీర్యం చేసిన కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలివ్వటం దేనికి సంకేతం? బీజేపీని హైదరాద్‌కే పరిమితం చేసిన ఘనత కిషన్ రెడ్డిదే అని జిట్టా పేర్కొన్నారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ రాజసింగ్ పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయటం లేదు? అని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేస్తారనేరన్న భయం బీజేపీకి పట్టుకుందని జిట్టా బాల‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Latest News