1949 నుంచి ఆ టీ కొట్టులో పొయ్యిని ఆర్ప‌నేలేద‌ట‌..!

ఎన్నో త‌రాల క్రితం పెట్టిన కొన్ని వ్యాపారాల‌ను ఇప్ప‌టినీ నిర్వ‌హిస్తున్న వార‌సులు అనేక మంది క‌న‌ప‌డ‌తారు.

  • Publish Date - December 4, 2023 / 10:20 AM IST

విధాత‌: ఎన్నో త‌రాల క్రితం పెట్టిన కొన్ని వ్యాపారాల‌ను ఇప్ప‌టినీ నిర్వ‌హిస్తున్న వార‌సులు అనేక మంది క‌న‌ప‌డ‌తారు. అయితే ఈ వార‌స‌త్వ వ్యాపారాల కొన‌సాగింపు పెద్ద పెద్ద కార్పొరేట్ల‌లోనే ఉంటుంద‌ని చాలా మంది అనుకుంటారు. కానీ రోడ్డు ప‌క్క‌న ఉండే హోట‌ళ్లు, టీ బ‌డ్డీల‌కూ త‌రాల నాటి చ‌రిత్ర ఉంటుంది.


తాజాగా రాజ‌స్థాన్‌ (Rajasthan) లోని జోథ్‌పుర్‌లో ఉన్న ఓ టీ స్టాల్ క‌థ ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది. అక్క‌డ పాలు కాచ‌డానికి ఉప‌యోగించే ప్ర‌ధాన పొయ్యి 1949 నుంచి వెలుగుతూనే ఉంద‌ని.. ఒక్క సారి కూడా దానిని ఆర్పేందుకు అవ‌స‌రం ప‌డ‌లేద‌ని దాని య‌జ‌మాని విపుల్ నికుబ్ పేర్కొన్నారు. అత‌ని తాత‌గారు 1949లో ఈ టీ బ‌డ్డీని ఏర్పాటు చేయ‌గా.. ఆయ‌న నుంచి త‌న తండ్రికి, అనంత‌రం త‌న‌కు వ‌చ్చింద‌ని నికుబ్ వెల్ల‌డించాడు.


కాగా.. త‌మ టీ కొట్టు రోజుకు 22 నుంచి 24 గంట‌ల పాటు నిర్విరామంగా ప‌నిచేస్తూనే ఉంటుంద‌ని.. 1949లో వెలిగించిన పొయ్యి ఇప్ప‌టికి ఒక్క‌సారి కూడా ఆర్ప‌లేద‌ని పేర్కొన్నాడు. ఈ పొయ్యిని ఇప్ప‌టికీ చెక్క, బొగ్గుతోనే మండిస్తున్నామ‌ని.. అందుకే త‌మ టీ, పాలు, కాఫీల‌కు అంత క్రేజు అని చెప్పుకొచ్చాడు