Kaleshwaram: అక్రమాస్తుల కేసులో ఇటీవల కాళేశ్వరం ఈఈని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతడికి తాజాగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం నీటిపారుదలశాఖలో ఈఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్ కు సంబంధించిన ఆస్తులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నూనె శ్రీధర్ కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. శ్రీధర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టాలని చూస్తున్నారు. అతడి బ్యాంక్ లావాదేవీలు, ఇతర ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించాలని పోలీసులు భావించారు.
శ్రీధర్ భారీగా ఆస్తులను కూడబెట్టినట్టు పోలీసుల ఇప్పటికే గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో శ్రీధర్ కు భారీగా నివాససముదాయాలు, ప్లాట్లు, ఫ్లాట్లు ఉన్నాయి. లాకర్లలో బంగారం, పెద్ద ఎత్తున నగదు ఉన్నట్టు గుర్తించారు. ఏసీబీ అధికారుల విచారణలో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.