Karimnagar | తల్లిని చంపిన కొడుకు అరెస్టు

Karimnagar విధాత బ్యూరో, కరీంనగర్: వ్యవసాయ భూమి తన పేరు మీద చేయడం లేదని తల్లినే కిరాతకంగా చంపిన సంఘటన గన్నేరువరం మండలం గోపాల్ పూర్ గ్రామంలో బుధవారం జరిగిన విషయం విధితమే. ఈ సంఘటనలో నిందితుడు తమ్మనవేని వినోద్ (35)ను గురువారం అరెస్టు చేశారు. తిమ్మాపూర్ మండలం రేణిగుంటకు చెందిన మృతురాలు తమ్మనవేణి కనకమ్మ భర్త వదిలిపెట్టి వెళ్లడంతో 20 సంవత్సరాలుగా కుటుంబ బాధ్యతలను తనే మోస్తూ వస్తున్నది. ఆమె పేరిట ఉన్న 1.20 గుంటల […]

  • Publish Date - August 3, 2023 / 01:41 AM IST

Karimnagar

విధాత బ్యూరో, కరీంనగర్: వ్యవసాయ భూమి తన పేరు మీద చేయడం లేదని తల్లినే కిరాతకంగా చంపిన సంఘటన గన్నేరువరం మండలం గోపాల్ పూర్ గ్రామంలో బుధవారం జరిగిన విషయం విధితమే. ఈ సంఘటనలో నిందితుడు తమ్మనవేని వినోద్ (35)ను గురువారం అరెస్టు చేశారు. తిమ్మాపూర్ మండలం రేణిగుంటకు చెందిన మృతురాలు తమ్మనవేణి కనకమ్మ భర్త వదిలిపెట్టి వెళ్లడంతో 20 సంవత్సరాలుగా కుటుంబ బాధ్యతలను తనే మోస్తూ వస్తున్నది.

ఆమె పేరిట ఉన్న 1.20 గుంటల భూమిని ఆమె కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది. అయితే గోపాలపురంలో ఉన్న మరో రెండు ఎకరాల భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలంటూ వినోద్ గత సంవత్సర కాలం నుండి ఒత్తిడి తెస్తున్నాడు.

తన పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదని తల్లిని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. ఆ భూమి అక్కా, చెల్లెళ్ళు కాజేస్తారనే ఉద్దేశంతో గోపాలపురం వెళ్లిన వినోద్ తల్లి వ్యవసాయ పనులు చేస్తుండగా విచక్షణ రహితంగా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఆస్తికి సంబంధించిన తగాదాలలో ప్రభుత్వ అధికారులను గాని, కోర్టులను గాని సంప్రదించాలే తప్ప ఇలాంటి నేరాలకు పాల్పడడం సరైంది కాదని తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు.
నిందితుడితో పాటు ద్విచక్ర వాహనం, హత్య చేయడానికి ఉపయోగించిన పారను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.