Karimnagar | మానేరులో స్నానానికి వెళ్లి.. ఇద్దరు చిన్నారుల మృతి

Karimnagar ఎల్లమ్మ కొలుపు కోసం బంధువుల ఇంటికి వచ్చిన చిన్నారులు స్నానాల కోసం చెక్ డ్యామ్‌లోకి దిగిన నలుగురు చిన్నారులు నీటిలో మునిగి ఇద్దరి మృతి.. మరో ఇద్దరిని కాపాడిన బంధువు విధాత బ్యూరో, కరీంనగర్: మానేరు ఇద్దరు చిన్నారులను కబలించింది. ఎల్లమ్మ కొలుపు ఉత్సవంలో బంధువులతో కలిసి ఆనందంగా పాల్గొనాల్సిన వీరు.. క్షణాల వ్యవధిలోనే విగత జీవులుగా మారిపోయారు. మానేరు నదిలో ఇసుక తవ్వకాల కారణంగా నీటి లోతు తెలియక అభం శుభం ఎరగని చిన్నారులు […]

  • Publish Date - June 14, 2023 / 10:50 AM IST

Karimnagar

  • ఎల్లమ్మ కొలుపు కోసం బంధువుల ఇంటికి వచ్చిన చిన్నారులు
  • స్నానాల కోసం చెక్ డ్యామ్‌లోకి దిగిన నలుగురు చిన్నారులు
  • నీటిలో మునిగి ఇద్దరి మృతి.. మరో ఇద్దరిని కాపాడిన బంధువు

విధాత బ్యూరో, కరీంనగర్: మానేరు ఇద్దరు చిన్నారులను కబలించింది. ఎల్లమ్మ కొలుపు ఉత్సవంలో బంధువులతో కలిసి ఆనందంగా పాల్గొనాల్సిన వీరు.. క్షణాల వ్యవధిలోనే విగత జీవులుగా మారిపోయారు.
మానేరు నదిలో ఇసుక తవ్వకాల కారణంగా నీటి లోతు తెలియక అభం శుభం ఎరగని చిన్నారులు అసువులు బాసారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినా, పట్టించుకోని అధికారుల వైఖరి మరో ఇద్దరి ప్రాణాలు బలిగొంది.

జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన జూపాక కన్ని(13), కాసర్ల నిత్య(12)
వీణవంక మండలం కొండపాక గ్రామంలో తమ బంధువుల ఇళ్లలో జరుగుతున్న ఎల్లమ్మ కొలుపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.

వీరి బంధువైన కొలుగూరి సంపత్ ఈ ఇద్దరితోపాటు మరో ఇద్దరు పిల్లలను స్నానాల కోసం మానేరులో పొత్కపల్లి-కొండపాక గ్రామాల మధ్య నిర్మించిన చెక్ డాం వద్దకు తీసుకువచ్చారు. స్నానాలు చేస్తున్న క్రమంలో లోతు తెలియక కన్ని, నిత్య నీటిలో మునిగిపోగా, మరో ఇద్దరిని సంపత్ ప్రాణాలతో రక్షించగలిగారు.

అటు వీణవంక, ఇటు పొత్కపల్లి పోలీసులు రంగంలోకి దిగి ఈతగాళ్లను రప్పించి మృతి చెందిన చిన్నారులను బయటకు తీశారు. శుభ కార్యక్రమానికి విచ్చేసిన‌ అభం శుభం తెలియని చిన్నారులు మృతి చెందడంతో కొండపాక, తనుగుల గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.