విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం కార్మిక మాసం ఆదాయం 14కోట్ల 91లక్షల 10వేల 31రూపాయలుగా వచ్చినట్లుగా ఈవో గీత తెలిపారు. యాదఋషి నిలయం గదుల అద్దెల ద్వారా 28,18,165రూపాయలు, ప్రసాదాల విక్రయం ద్వారా 3కోట్ల 50లక్షల 79,660రూపాయలు, నిత్యకల్యాణోత్సవాల ద్వారా 28లక్షల 25,624రూపాయలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల(18,824) నిర్వాహణ ద్వారా 1కోటి 64లక్షల 20,660రూపాయలు, స్వర్ణ పుష్పార్చన ద్వారా 27లక్షల 61,200రూపాయలు, వీఐపీ దర్శనాల ద్వారా 99లక్షలు, వీఐపీ బ్రేక్ దర్శనాల ద్వారా 70లక్షల 19,100రూపాయలు, కొండపైకి వాహన ఫ్రవేశ రుసుంల ద్వారా 1కోటి 13లక్షల 50వేలు, కల్యాణ కట్ట ద్వారా 18లక్షల 84,900రూపాయలు, ఇతరములతో 5కోట్ల 90లక్షల 50, 782రూపాయల ఆదాయం వచ్చినట్లుగా తెలిపారు.