క‌స‌బ్ మొఖంలో ఎలాంటి ప‌శ్చాత్తాపం క‌నిపించ‌లే!

ఆ రాత్రి 20 మంది మ‌హిళ‌ల‌కు పురుడు ఐక్య‌రాజ్య‌స‌మితిలో వీడియో లింక్ ద్వారా ప్ర‌సంగించిన అంజ‌లీ కుల్థే విధాత‌: 26/11 ముంబాయి ప్ర‌జ‌ల‌కే కాదు దేశ ప్ర‌జ‌ల‌కు దుర్దినం. అన్నెం పున్నెం ఎరుగ‌ని 166 మంది సాధార‌ణ పౌరులు ముంబాయి టెర్ర‌ర్ దాడిలో అసువులు బాశారు. మ‌రో 300మందికి పైగా గాయాల పాల‌య్యారు. ఈ దాడిలో ప‌ట్టుబ‌డిన వాడు ఇద్ద‌రిని కాల్చి చంపిన ఉదంతాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన అంజలీ కుల్థే టెర్ర‌రిస్టును గుర్తించింది. ఆ అగంత‌కుడి పేరే […]

  • Publish Date - December 17, 2022 / 11:16 AM IST
  • ఆ రాత్రి 20 మంది మ‌హిళ‌ల‌కు పురుడు
  • ఐక్య‌రాజ్య‌స‌మితిలో వీడియో లింక్ ద్వారా ప్ర‌సంగించిన అంజ‌లీ కుల్థే

విధాత‌: 26/11 ముంబాయి ప్ర‌జ‌ల‌కే కాదు దేశ ప్ర‌జ‌ల‌కు దుర్దినం. అన్నెం పున్నెం ఎరుగ‌ని 166 మంది సాధార‌ణ పౌరులు ముంబాయి టెర్ర‌ర్ దాడిలో అసువులు బాశారు. మ‌రో 300మందికి పైగా గాయాల పాల‌య్యారు. ఈ దాడిలో ప‌ట్టుబ‌డిన వాడు ఇద్ద‌రిని కాల్చి చంపిన ఉదంతాన్ని ప్ర‌త్య‌క్షంగా చూసిన అంజలీ కుల్థే టెర్ర‌రిస్టును గుర్తించింది. ఆ అగంత‌కుడి పేరే క‌స‌బ్‌. ముంబాయి టెర్ర‌ర్ దాడిలో ప్ర‌త్య‌క్షంగా ప‌ట్టుబ‌డిన ఏకైక టెర్ర‌రిస్టు క‌స‌బ్‌ను గుర్తించిన అంజ‌లి హాస్పిట‌ల్‌లో స్టాఫ్ న‌ర్సు.

టెర్ర‌ర్ దాడిని ప్ర‌త్య‌క్షంగా చూసిన అంజ‌లి మొన్న గురువారం ఐక్య‌రాజ్య‌స‌మితిలో వీడియో లింక్ ద్వారా ప్ర‌సంగించారు. యూఎన్ ఓ భ‌ద్ర‌తామండ‌లి నిర్వ‌హించిన ది గ్లోబ‌ల్ కౌంట‌ర్ టెర్ర‌రిజం అప్రోచ్ చాలెంజెస్ -అండ్ ది వే ఫార్వార్డ్ స‌ద‌స్సులో ఆమె త‌న అనుభ‌వాల‌ను ప్ర‌పంచంతో పంచుకున్నారు.

ముంబాయి టెర్ర‌ర్ నిందితున్ని గుర్తించేందుకు అధికారులు న‌న్ను నెల‌ రోజుల త‌ర్వాత పిలిచారు. మొద‌ట నాకు భ‌య‌మేసింది. అయినా సాక్ష్యం చెప్పేందుకు నిర్ణ‌యించుకొన్నాన‌ని తెలిపింది. జైలుకు వెళ్లిన అంజ‌లి క‌స‌బ్ ను గుర్తించింది. ఆ సంద‌ర్భంగా.. మేడం.. మీరు న‌న్ను స‌రిగానే గుర్తించారు. నేను అజ్మ‌ల్ క‌స‌బ్‌ను అని చిరున‌వ్వుతో అన్నాడు. అప్పుడాత‌ని మొఖంలో ఎలాంటి భ‌యం, ప‌శ్చాత్తాపం క‌నిపించ‌లేదని తెలిపింది. నేను న‌ర్సు డ్రెస్సులోనే జైలుకు వెళ్లానని గుర్తు చేసుకొన్న‌ది.

ఒక వ్యూహాత్మ‌కంగా 10మంది టెర్ర‌రిస్టులు భార‌త వాణిజ్య రాజ‌ధాని ముంబాయి ల‌క్ష్యంగా దాడికి తెగ‌బ‌డ్డారు. ముంబాయిలోని ప్ర‌ముఖ ప్రాంతాలు ఛ‌త్ర‌ప‌తి శివాజీ టెర్మిన‌స్ రైల్వే స్టేష‌న్‌, నారిమ‌న్ హౌజ్‌, కామా హాస్పిట‌ల్‌, లియోపోల్డ్ కేఫ్‌, ఒబెరాయ్ హోట‌ల్‌, తాజ్ హోట‌ల్ లాంటి స్థ‌లాల‌ను ఎంచుకొని దాడులు చేశారు. ఏకే 47, 56లాంటి అత్యాధునిక ఆయుధాల‌ను చేత‌బ‌ట్టి ప్ర‌జ‌ల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా బుల్లెట్లు కురిపించారు. ఆ క్ర‌మంలో వారిని నియంత్రించేదుకు చేసిన ప్ర‌య‌త్నంలో 9 మంది టెర్ర‌రిస్టులు చ‌నిపోయారు.

2018 న‌వంబ‌ర్ 26న మొద‌లైన దాడి మూడు రోజులు కొన‌సాగి 29న ముగిసింది. ఈ మూడు రోజులు టెర్ర‌రిస్టులు క‌నిపించిన వారిన‌ల్లా కాల్చిచంపుతూనే ఉన్నారు. ఆ క్ర‌మంలో క‌స‌బ్ హాస్పిట‌ల్ గేటు గుండా లోప‌లికి ప్ర‌వేశిస్తూనే ఇద్ద‌రు హాస్పిట‌ల్ సెక్యూరిటీ సిబ్బందిని కాల్చిచంపాడు.

అంజ‌లీ ఈ హాస్పిట‌ల్‌లోనే నిండు గ‌ర్భిణులైన మ‌హిళ‌ల‌ను, శిశువుల‌కు సేవ‌లు చేస్తూ ఉన్న‌ది. కాల్పుల శ‌బ్దం విని కిందికి చూసే స‌రికి క‌స‌బ్ ఇద్ద‌రిని కాల్చి చంపి హాస్ప‌టిల్ లోకి దూసుకు రావ‌టం చూసింది. తాను జీవించి ఉన్నంత వ‌ర‌కు మ‌నుషుల‌కు ప్రాణం పోస్తూ వీలైనంత మందిని బ‌తికించాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ది. ఆ రాత్రంతా 20 మంది మ‌హిళ‌ల‌కు పురుడు పోసి 20 ప్రాణాల‌కు ప్రాణాధార‌మైంది.

26/11 నాటి ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికీ గుర్తుకు వ‌స్తూ న‌న్ను క‌ల‌వ‌ర పెడుతుంటాయని తెలిపింది. ముంబాయి దాడిలో ఎంద‌రో చ‌నిపోయారు. ఎంతో మంది అనాథ‌ల‌య్యారు. మ‌రెంతో మంది తీవ్ర గాయాల‌తో ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతున్నారు. బాధితులు ఇప్ప‌టికీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

కానీ దాడికి కార‌కులైన వారు క్షేమంగా తిరుగుతున్నారు. దాడుల‌కు కార‌కులైన వారిని ఎప్ప‌టికీ వ‌ద‌ల‌కూడ‌దు. దోషుల‌కు క‌ఠిన శిక్ష ప‌డాల్సిందేన‌ని, ఆప్పుడే బాధితులకు శాంతి చేకూరుతుంద‌ని ఈ స‌మావేశం ద్వారా అంత‌ర్జాతీయ స‌మాజాన్ని కోరుతున్నాన‌ని అంజ‌లి పిలుపునిచ్చారు.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం దేశ దేశాల్లో టెర్ర‌రిజం అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తుంటే.. శాంతియుత సుర‌క్షిత జీవితం ప్ర‌జ‌ల‌కు అనుభ‌వంలోకి రావ‌టం దుర్ల‌భ‌మని చెప్ప‌క త‌ప్ప‌దు.