Nivedita | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆరెస్ అభ్యర్థిగా నివేదిత

  • Publish Date - April 10, 2024 / 05:30 PM IST

  • అధికారికంగా ప్రకటించిన కేసీఆర్

విధాత, హైదరాబాద్ : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి గైని నివేదిత (Nivedita) ను బీఆరెస్‌ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం నివేదితను అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. నివేదిత దివంగత ఎమ్మెల్యే సాయన్నకు పెద్ద కూతురు. ఆమె చెల్లెలు లాస్య నందిత 2023అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి గెలిచాక రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరుగనుంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ మే 13వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేశ్‌ను ఖరారు చేశారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి లాస్య నందిత చేతిలో ఓడినప్పటికి రెండో స్థానంలో నిలిచారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల మూడవ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సివుంది.

Latest News