ఢిల్లిలో.. BRS అధినేత కేసీఆర్ బిజీ బిజీ

విధాత‌: భార‌త రాష్ట్ర స‌మితి జాతీయ అధ్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు రెండో రోజు ఢిల్లీలో బిజీబిజీగా గ‌డిపారు. హ‌స్తిన‌లో గులాబీ జెండా రెప‌రెప‌లాడించి, పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు రెండో రోజు కూడా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ఉన్న‌ తుగ్ల‌క్ రోడ్డు సంద‌డిగా మారింది. జ‌న సందోహంతో కిక్కిరిసి పోయింది. ఆయా రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు, రైతు సంఘాల నాయ‌కులు కేసీఆర్‌ను క‌లిసి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌నను క‌లిసి […]

  • Publish Date - December 15, 2022 / 02:55 PM IST

విధాత‌: భార‌త రాష్ట్ర స‌మితి జాతీయ అధ్య‌క్షుడు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు రెండో రోజు ఢిల్లీలో బిజీబిజీగా గ‌డిపారు. హ‌స్తిన‌లో గులాబీ జెండా రెప‌రెప‌లాడించి, పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌కు రెండో రోజు కూడా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి.

సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ఉన్న‌ తుగ్ల‌క్ రోడ్డు సంద‌డిగా మారింది. జ‌న సందోహంతో కిక్కిరిసి పోయింది. ఆయా రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు, రైతు సంఘాల నాయ‌కులు కేసీఆర్‌ను క‌లిసి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌నను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపేందుకు వ‌చ్చిన ప్ర‌తీ అభిమాని, కార్య‌క‌ర్త‌ను కేసీఆర్ పేరుపేరునా ప‌ల‌క‌రించి, వారితో ఫొటోలు దిగారు.

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా అవతరించిన చారిత్రక నేపథ్యంలో, తమ అభిమాన నేతను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఫొటో దిగి, తమ ఢిల్లీ జ్ఞాపకాలను పదిలంగా దాచుకుని నూతనోత్సాహంతో అభిమానులు తిరుగు ప్రయాణమయ్యారు.

బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యాన్ని స‌ర్దార్ ప‌టేల్ మార్గ్‌లో నిన్న కేసీఆర్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. కార్య‌క్ర‌మంలో క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్, ఆయా రాష్ట్రాల‌కు చెందిన రైతు నాయ‌కులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.

పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా రాజ‌శ్యామ‌ల యాగం, న‌వ‌చండీ యాగాల్లో కేసీఆర్ దంప‌తులు పాల్గొన్న విష‌యం తెలిసిందే. పార్టీ ఆఫీసు ప్రారంభోత్స‌వం ముగిసిన అనంత‌రం ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు నివాసానికి కేసీఆర్ వెళ్లారు.