Gold Coins
కెంటకీ: అప్పుడప్పుడు మనం ఊహించని కొన్ని వింతలు, విడ్డూరాలు సంభవిస్తుంటాయి. అటువంటి వింతే ఒకటి అమెరికాలో జరిగింది. కెంటకీలోని ఒక మొక్కజొన్న చేనులో పనిచేసుకుంటున్న రైతుకు బంగారు నాణేలు దాచి ఉంచిన నిధి ఒకటి దొరికింది. ఈ అరుదైన 700 బంగారు నాణేలు అమెరికాలో జరిగిన అంతర్యుద్ధ కాలం నాటివని గుర్తించారు.
ఇవి 1840 నుండి 1863 వరకు చెలామణిలో ఉన్నాయని పురాతత్వ వేత్తలు తెలిపారు. వీటి విలువ 2 మిలియన్ డాలర్లు ఉంటుందని పాత నాణేల డీలర్ ఒకరు అంచనా వేశారు. వీటిలో 1 డాలర్ గోల్డ్ ఇండియన్స్, 10 డాలర్ గోల్డ్ లిబర్టీస్, 20 డాలర్ల గోల్డ్ లిబర్టీస్ ఉన్నాయి. నాణేలను కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచారు.