Site icon vidhaatha

Keralam | కేరళ ఇక కేరళం.. పేరు మార్పునకు శాసన సభ ఆమోదం

Keralam

విధాత: కేరళ రాష్ట్రం పేరును కేరళం గా మారుస్తు ఆ రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. రాజ్యంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో పేర్కోన్న అన్ని అధికారిక భాషాల్లోనూ కేరళను కేరళంగా మార్చాలని కోరుతు సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతిపక్ష కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించింది.

శాసన సభ తీర్మానం మేరకు కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం పినరయి విజయన్ కోరారు. ఇప్పటికే మలయాళంలో కేరళను కేరళంగా పిలుస్తున్నారు. ఇతర అన్ని భాషాల్లోనూ అలాగే పిలువాలని కేరళ శాసన సభ తీర్మానం ద్వారా కేంద్రాన్ని కోరింది.

Exit mobile version