కేవల్ కిషన్ జాతరను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

సీఎం కేసీఆర్ నిర్ణయం.. కేవల్ కిషన్‌కు నివాళులర్పించిన ఎంపీ విధాత, మెదక్ బ్యూరో: స్వర్గీయ కామ్రేడ్ కేవలం కిషన్ స్మృతి వన నిర్మాణం కోసం కృషి చేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పోలంపల్లి గ్రామ శివారులో కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధుల వద్ద నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కామ్రేడ్ కేవల్ కిషన్ జాతరను ఈ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామ్రేడ్ కిషన్ చేసిన […]

  • Publish Date - December 26, 2022 / 05:04 PM IST

సీఎం కేసీఆర్ నిర్ణయం.. కేవల్ కిషన్‌కు నివాళులర్పించిన ఎంపీ

విధాత, మెదక్ బ్యూరో: స్వర్గీయ కామ్రేడ్ కేవలం కిషన్ స్మృతి వన నిర్మాణం కోసం కృషి చేస్తానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పోలంపల్లి గ్రామ శివారులో కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధుల వద్ద నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కామ్రేడ్ కేవల్ కిషన్ జాతరను ఈ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామ్రేడ్ కిషన్ చేసిన పోరాటాల స్ఫూర్తిని తెలిసిన వ్యక్తిగా జాతరను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

వివిధ వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు పేద ప్రజల కోసం భూమి పంచడంలో ముందుండి భూస్వాముల చేతిలో హతమైన కామ్రేడ్ కిషన్ పోరాటాల స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకు రావాలని కోరారు. కామ్రేడ్ కేవల్ కిషన్ పేరును ఏదైనా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలకు కళాశాలకు పెట్టి శాశ్వతంగా పేరు ఉండేలా చూద్దామని పిలుపునిచ్చారు. ముదిరాజుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు.

శాసన మండలి సభ్యుడు బండ ప్రకాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అడగగానే కిషన్ జాతర కోసం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. త్యాగాల స్ఫూర్తిని పోరాటాల స్ఫూర్తిని ఎప్పుడు ఉండాలని పేదలుగా బతకకుండా ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ కేవలం కిషన్ సమాధుల వద్ద ముదిరాజ్ మహాసభ జెండాను రాష్ట్ర శాఖ అధ్యక్షులు, శాసన మండలి సభ్యుడు బండ ప్రకాష్ ఆవిష్కరించారు.సమాధుల చుట్టూ పొలంపల్లి గ్రామస్తులచే బండ్ల ఊరేగింపు నిర్వహించగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జాతరలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి తో పాటు శాసన మండల సభ్యుడు బండ ప్రకాష్, స్థానిక జడ్పిటిసి ముదాం శ్రీనివాస్, ఎంపీపీ శ్రీనివాస్, చేగుంట సర్పంచ్ శ్రీనివాస్, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్, ముదిరాజ్ మహాసభ మండల శాఖ అధ్యక్షులు మేకల పరమేష్, పొలంపల్లి సర్పంచ్ నిర్మల సత్యం, కామ్రేడ్ కిషన్ కుమార్తె డాక్టర్ వీణ, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు అల్లుడు జగన్, టెలికాం బోర్డు సభ్యుడు సత్యనారాయణ తోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.