వాషింగ్టన్: విదేశాల్లో ఉన్న ఖలిస్తానీలు భారత రాయబారితో మరోసారి దురుసుగా ప్రవర్తించారు. రాయబారి తరంజిత్ సింగ్ సంధూను గురుద్వారా లోపలికి తోసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆయన చుట్టూ ఉన్న జనం.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు కుట్ర పన్నాడని నినాదాలు చేశారు. తరంజిత్ సంధూను బయటకు తీసుకెళ్లడానికి కొందరు ప్రయత్నించారు.
ఖలిస్తాన్ రెఫరెండమ్ ప్రచారంలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు పాత్రపై నిలదీసేందుకు ఖలిస్తాన్ అనుకూలవాదులు ప్రతయ్నించారు. ఈ అల్లరి మూకను ఎస్ ఎఫ్ జె పంపినట్లు బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ పి సింగ్ ఆరోపించారు. గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా నిజ్జర్ మరణానికి సంబంధించి భారతదేశంపై అనేక ఆరోపణలు చేశారు. వాటిని భారత ప్రభుత్వం తోసిపుచ్చింది.