కాంగ్రెస్ పాలనంతా అవినీతి మయం: కుష్బూ

దేశంలో కాంగ్రెస్ పాలన కాలమంతా అవినీతి మయమేనని నేషనల్ ఉమెన్ కమిషన్ సభ్యురాలు, సినీ నటి, బీజేపీ నేత కుష్బూ విమర్శించారు.

  • Publish Date - March 1, 2024 / 02:52 AM IST

విధాత : దేశంలో కాంగ్రెస్ పాలన కాలమంతా అవినీతి మయమేనని నేషనల్ ఉమెన్ కమిషన్ సభ్యురాలు, సినీ నటి, బీజేపీ నేత కుష్బూ విమర్శించారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో గురువారం నిర్వసించిన సభలో కుష్బూ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనేక సమస్యలతో సతమతమైన దేశం ప్రధాని నరేంద్ర మోడీ రెండు పర్యాయాల పాలనలో అంతర్జాతీయ స్థాయిలో బలమైన శక్తిగా రూపుదిద్ధుకుంటుందన్నారు. ప్రధాని భారత్‌ను గొప్ప దేశంగా తీర్చిదిద్దారని చెప్పారు. కరోనా సమయంలో అందరికీ ఉచితంగా టీకాలు అందించి, విదేశాలకు కూడా భారత్ టీకాలు అందించిందన్నారు.


మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించారని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించిందని తెలిపారు. కేంద్రం మహిళలకు అన్ని రంగాల్లో గొప్ప అవకాశాలను కల్పించిందన్నారు. నిరంతరం దేశం కోసం పనిచేసే వ్యక్తి ప్రధాని మోడీ అని కొనియాడారు. ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ను నిలపడమే ధ్యేయంగా పెట్టుకున్న ప్రధాని మోడీ గెలుపు కోసం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీజేపీ విజయంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 400 సీట్లతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Latest News