Site icon vidhaatha

KRMB | తెలుగు రాష్ట్రాలకు సాగర్‌ తాగునీటి కేటాయింపులు

విధాత, హైదరాబాద్‌ : నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు తాగునీటి కేటాయింపులు చేస్తూ కేఆర్‌ఎంబీ(కృష్ణానది యాజమాన్య బోర్డు) నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 12న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది.

వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 500 అడుగుల వరకు సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉండగా, అందులో ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించారు. మిగిలిన నీరు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాల కోసం వినియోగానికి తెలంగాణకు అనుమతిచ్చారు. వేసవిలో ఎదురవుతున్న నీటి ఎద్దడి నేపథ్యంలో పూర్తిగా తాగునీటి అవసరాల కోసమే ఈ నీటిని వినియోగించుకోవాలని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.

Exit mobile version