Site icon vidhaatha

పీవీకి భారత రత్న ఇవ్వాలి : కేటీఆర్‌

విధాత : భారత మాజీ ప్రధాని పీ.వీ. నరసింహరావు కు కేంద్రం భారత రత్న ఇవ్వాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. శనివారం పీవీ 19వ వర్ధంతి పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులోని పీవీ విగ్రహం వద్ధ పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా పీవీకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశామని, అదే డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నామన్నారు.


ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం పీవీకి సముచిత గౌరవం కల్పించిందని, తెలుగు వారి ఠీవిగా అభివర్ణించిందన్నారు. దేశ ప్రధానులలో పీవీ పాలన దక్షత చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందన్నారు. ఆనాటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా, ప్రధానిగా పీవీ చేసిన ఆర్ధిక సంస్కరణలు సంక్షోభంలో ఉన్న దేశాన్ని తిరిగి గాడిన పెట్టాయన్నారు. తెలుగు వారికీ, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన పీవీ నర్సింహ రావు ఆదర్శనీయ పాలకుడిగా చిరస్మరణీయుడన్నారు.


బీఆరెస్ స్వేద పత్రం విడుదల రేపటికి వాయిదా

బీఆరెస్‌ తొమ్మిదిన్నరేళ్ల పాలనా విజయాలపై శనివారం తెలంగాణ భవన్‌లో విడుదల చేయ తలపెట్టిన ‘స్వేద పత్రం’ విడుదల కార్యక్రమం ఆదివారానికి వాయిదా వేసినట్లుగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బీఆరెస్ పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాల పేరుతో విఫల పాలనగా చూపే ప్రయత్నం చేస్తుందని అంతకుముందు ట్వీట్టర్ వేదికగా కేటీఆర్ తెలిపారు. గలూ రాత్రి తేడా లేకుండా తాము రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను అప్పుల పేరుతో దెబ్బతీస్తే సహించబోమని, అందుకే గణాంకాలు సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకుగ “స్వేద పత్రాన్ని’ ప్రజల ముందు ఉంచనున్నాం” అని కేటీఆర్ పేర్కొన్నారు

Exit mobile version