చంద్ర‌బాబు జోస్యం: ఏపీకి ఇవే ఆఖరు ఎన్నికలట! సీనియర్ల.. చిరాకు

విధాత‌: అధికారం పోయాక చంద్రబాబు పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. జగన్ను.. ఇంకా ఆయన్ను సీఎంగా గెలిపించిన ప్రజలను తిడుతూ.. శాపాలు పెడుతూ ఉన్నారు. మళ్లీ ఎన్నికలకు సమయం రావడంతో చంద్రబాబు మాటల దాడి పెంచారు. అయితే ఈసారి మాత్రం ఇదే లాస్ట్.. ఇదే ఫైనల్.. ఇదే చివరి ఎన్నికలు అంటున్నారు. మరి చివర.. లాస్ట్.. ఫైనల్ అంటే ఆయానకేమో అనుకునేరు.. కాదట.. ఏపీకి ఇవే సివరాఖరు ఎలక్షన్లు అని చంద్రబాబు అంటున్నారు. తరువాత కలియుగం అంతం అయిపోతుందో.. […]

  • Publish Date - December 1, 2022 / 12:31 PM IST

విధాత‌: అధికారం పోయాక చంద్రబాబు పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. జగన్ను.. ఇంకా ఆయన్ను సీఎంగా గెలిపించిన ప్రజలను తిడుతూ.. శాపాలు పెడుతూ ఉన్నారు. మళ్లీ ఎన్నికలకు సమయం రావడంతో చంద్రబాబు మాటల దాడి పెంచారు. అయితే ఈసారి మాత్రం ఇదే లాస్ట్.. ఇదే ఫైనల్.. ఇదే చివరి ఎన్నికలు అంటున్నారు. మరి చివర.. లాస్ట్.. ఫైనల్ అంటే ఆయానకేమో అనుకునేరు.. కాదట.. ఏపీకి ఇవే సివరాఖరు ఎలక్షన్లు అని చంద్రబాబు అంటున్నారు. తరువాత కలియుగం అంతం అయిపోతుందో.. భూగోళం బద్దలు అయిపోతుందో ఆయనకే తెలియాలి.

చంద్రబాబు తీరు, ప్రస్ట్రేషన్ చూస్తుంటే ఈసారి తనను గెలిపించకపోతే అవే తనకు చివరి ఎన్నికలు అని చెబుతున్నట్లుగా అర్థం అవుతోంది. ఆ తరువాత 2029లో పోటీ చేసేందుకు తనకు శక్తి, వయసు ఉండదు కాబట్టి తనకు 2024 ఎన్నికలే చివరివి అని ఆయన చెబుతున్నారని జనం అర్థం చేసుకుంటున్నారు.

అందుకే ఆయన కర్నూల్ సభలో తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ తనను గెలిపించి అసెంబ్లీలో తిరిగి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని ప్రజలను కోరుకున్నారు. అయితే అది బూమరాంగ్ అయింది. వైసీపీ నుంచి గట్టి అటాక్ వచ్చింది. బాబుకు కచ్చితంగా 2024లో వ‌చ్చేవి చివరి ఎన్నికలే అంటూ వారు ఎదురు దాడి చేస్తున్నారు.

చంద్రబాబు ఇవే లాస్ట్.. ఇవే ఆఖరు అని అనడం ఎందుకూ అని టీడీపీ సీనియర్లు కూడా లోలోన చిరాకు పడుతున్నారు. రాష్ట్రానికి లాస్ట్ చాన్స్ ఏమి ఉంటుందని బాబునే రివర్స్ లో ప్రశ్నిస్తున్నారgతా. ఏపీ ఏ ఒక్క రాజకీయ పార్టీకో కట్టుబడి లేదు.

నాడు కాంగ్రెస్ కమ్యూనిస్టుల నుంచి మొదలు పెడితే ఎన్నో పార్టీలను చూసింది. మరెన్నో పార్టీలను చూస్తుంది. ఒకరి పాలన నచ్చకుంటే ప్రజలే ఎన్నికల్లో ఓట్లతో తీర్పు చెబుతారు తప్ప రాష్ట్రానికి ఇవి చివరి ఎన్నికలు అంటూ ప్రచారం చేయడం ఏమిటన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.