ఓటర్‌.. దేవుళ్లకు నేతల మొక్కులు

నిన్నటి దాకా ఓటర్‌ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎక్కని గడప తొక్కన గడప అన్నట్లుగా రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ప్రచారం సాగించారు

  • Publish Date - November 29, 2023 / 09:43 AM IST
  • రేవంత్‌, థాక్రే..కిషన్‌ రెడ్డిల పూజలు


విధాత: నిన్నటి దాకా ఓటర్‌ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎక్కని గడప తొక్కన గడప అన్నట్లుగా రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ప్రచారం సాగించారు. ప్రచార ఘట్టం ముగిసిపోవడంతో ఇక గుళ్లు, దర్గాల చుట్టు తిరుగుతూ తమనే గెలిపించాలని వేడుకుంటున్నారు.

బుధవారం పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు థాక్రేలు హైద్రాబాద్‌ బిర్లా మందిర్‌లో, నాంపల్లి యూసఫియన్‌ దర్గాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆరు గ్యారంటీల కార్డుతో వారు ఈ పూజలు నిర్వహించి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రార్ధించారు. అటు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని బీజేపీ గెలుపు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.