Site icon vidhaatha

Liquor Scam Case | ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు దక్కని బెయిల్‌

Liquor Scam Case

విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. బెయిల్ కోసం సిసోడియా వేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయగా, దీనిపై ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సిసోడియ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన వాదనలు వినిపిస్తూ భార్య అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్‌ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసం సిసోడియా భార్య వైద్య రికార్డులను పరిశీలించి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.

అందువల్ల ఈ కేసులో సాధారణ, మధ్యంతర బెయిల్ పిటిషన్లను పరిగణలోకి తీసుకుంటాన‌ని చెప్పి విచారణను సెప్టెంబర్ 4వ తేదికి వాయిదా వేసింది.

Exit mobile version