Mahesh Cooperative Bank in: అన్నం పెట్టే పనికి సున్నం పెట్టడం అంటే ఇదేనేమో మరి. ఉద్యోగం చేస్తున్న బ్యాంకుకే టోకరా వేసిన బ్యాంకు సిబ్బంది బాగోతం బయటపడిన ఘటన సంచలనం రేపింది. ఏపీలోని మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకు వరంగల్ బ్రాంచ్ లో ఉద్యోగులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.43లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నారు. ఈ వ్యవహారం ఆడిట్ ప్రక్రియలో బయటపడటంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపారు. కస్టమర్ల పేర్లతో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.43 లక్షలు లోన్ తీసుకున్న ఇంటిదొంగలను గుర్తించారు. బ్యాంకు మేనేజర్ కొప్పుల శివకృష్ణ, జాయింట్ కస్టోడియన్స్ రాము శర్మ, జీవిత కుమార్, గోల్డ్ అప్రైజర్స్ బ్రహ్మచారి, రాజమౌళి, కరుణాకర్ కస్టమర్ల పేర్లపై అక్రమంగా ఖాతాలు తెరిచినట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్, ముగ్గురు గోల్డ్ అప్రైజర్లు, ముగ్గురు ఖాతాదారులపై వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీసులు వారిపై 221సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.
Mahesh Cooperative Bank: సొంత బ్యాంకుకే టోకరా..నకిలీ బంగారంతో లోన్లు!
