విధాత : ప్రపంచంలోనే అతిపెద్ద భారీ మహాశివలింగాన్ని బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లా విరాట్ రామాయణ్ మందిరంలో శనివారం అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమంలో వేద మంత్రోచ్చరణల మధ్య ప్రతిష్టించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, సాధు సంతులు మహాశివలింగం ప్రతిష్టాపనోత్సవానికి హాజరయ్యారు.
తమిళనాడులోని మహాబలిపురం స్థపతులు 10ఏండ్ల పాటు శ్రమించి 33 అడుగుల ఎత్తు 210 మెట్రిక్ టన్నుల బరువుతో కూడిన ఏకశిలతో మహాశివలింగాన్ని చెక్కారు. దీనిపై 1008 చిన్న శివలింగాలను కూడా చెక్కారు. ఇది విరాట్ రామాయణ మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మహాబలిపురం నుంచి 2100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపారన్‌కు చేరిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి వేదమంత్రాలు,హెలికాప్టర్ల నుంచి కురిపించిన పూల వర్షాల మధ్య ప్రతిష్టాపన చేశారు. కైలాస్ మానస్ సరోవర్, గంగోత్రి,హరిద్వార్,ప్రయాగరాజ్,సోనాపూర్ వంటి ఐదు పవిత్ర స్థలాల నుండి తెచ్చిన జలాలతో శివలింగాన్ని అభిషేకించారు.
విశిష్ట రామాలయం..విరాట్ రామాయణ్ మందిరం
మహవీర్ మందిర్ సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విరాట్ రామాయణ మందిరం 1,080 అడుగుల పొడవు, 540 అడుగుల వెడల్పుతో నిర్మితమవుతుంది. ఇందులో 22 ఉప మందిరాలు, 18 గోపురాలు, 270 అడుగుల ఎత్తైన ప్రధాన గోపురం ఉంటాయి. రామాయణంలో ఉండే కొన్ని సన్నివేశాలను ఆలయ గోడల మీద చెక్కించారు. మందిరం ముఖద్వారం దగ్గర ఇప్పటికే , వినాయకుడి ఆలయం, ప్రధాన ద్వారం, నంది విగ్రహం వంటి కట్టడాలు పూర్తయిపోయాయి. మహబలిపురుం నుంచి ఏకశిల మహాశివలింగాన్ని 96 చక్రాల హైడ్రాలిక్ వాహనంపై ఇంజినీర్ల పర్యవేక్షణలో 25 రోజుల పాటు తరలించి విరాట్ రామాయణ్ మందిర్ కు చేర్చి ప్రతిష్టాపన చేశారు. రూ.500కోట్ల అంచనా వ్యయంతో 2023 జూన్ 20న ప్రారంభించిన ప్రధాన ఆలయం నిర్మాణం మొత్తం 2030 నాటికి నిర్మాణం పూర్తి కానుంది.
The world’s largest Shivling has been installed at the Viraat Ramayan Mandir (World’s largest religious monument) in Kesariya, Bihar.
The Viraat Ramayan Mandir will be 3 times larger than the Ram Mandir in Ayodhya. pic.twitter.com/fOjfxs0ZQr
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 17, 2026
ఇవి కూడా చదవండి :
Komatireddy : నల్లగొండ కార్పోరేషన్ తొలి మేయర్ పీఠం కాంగ్రెస్ దే
AIADMK Manifesto 2026 : ‘స్త్రీలకే కాదు..తమిళనాడులో పురుషులకు కూడా ఫ్రీ బస్సు స్కీమ్’
