లోకేశ్‌ ‘యువగళానికి జీవో గండం.. పాదయాత్ర మొదలయ్యేనా!

విధాత‌: పనివాడు పందిరి వేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టాయట.. పాపం లోకేష్ ను టిడిపి బ్రాండ్ అంబాసిడర్ లా మార్చి స్టార్ క్యాంపెయినర్ గా జనంలోకి పంపుదామని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లు ఉంది. యువగళం పేరిట ఈనెల 27 నుంచి 400 రోజులు 4000 కిమి పాదయాత్రకు లోకేష్ ను అన్ని విధాలా సిద్ధం చేస్తున్నా.. అసలు ఇప్పుడున్న కొత్త నిబంధనలు.. రూల్స్ ప్రకారం పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అన్న సందేహాలు […]

  • Publish Date - January 5, 2023 / 05:04 PM IST

విధాత‌: పనివాడు పందిరి వేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టాయట.. పాపం లోకేష్ ను టిడిపి బ్రాండ్ అంబాసిడర్ లా మార్చి స్టార్ క్యాంపెయినర్ గా జనంలోకి పంపుదామని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లు ఉంది.

యువగళం పేరిట ఈనెల 27 నుంచి 400 రోజులు 4000 కిమి పాదయాత్రకు లోకేష్ ను అన్ని విధాలా సిద్ధం చేస్తున్నా.. అసలు ఇప్పుడున్న కొత్త నిబంధనలు.. రూల్స్ ప్రకారం పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి.

ఈ నెల 27న ప్రారంభించే పాదయాత్ర.. కుప్పం నుంచి సిక్కోలు వరకు మొత్తం 400 రోజుల పాటు 4000 కిలో మీటర్ల లెక్కన ముందుకు సాగనుంది. ఇక ఈ యాత్రకు సంబంధించిన ఇతరత్ర ఏర్పాట్లు.. రూట్ మ్యాప్ సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జీవో-1/2023 విడుదల చేస్తూ బహిరంగ సభలు రోడ్డు షోలపై నిషేధం విధించింది.

యువగళంలో భాగంగా రోడ్డు షోలు..

అక్కడక్కడా బహిరంగ సభలు సైతం ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు.. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. యువతను ఎక్కువగా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇప్పడు ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో పెద్ద ఇబ్బందిగా మారింది.

ఇటీవల గుంటూరు, కందుకూరుల్లో జరిగిన తొక్కిసలాటలు మరణాల నేపథ్యంలో ఏపీ సర్కారు బహిరంగ సభలు ర్యాలీలపై నియంత్రణ విధిస్తోంది. తాజాగా కుప్పంలో చంద్రబాబు పర్యటనలకు రోడ్ షోకు కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ పరిణామాలను గమనిస్తే.. లోకేష్ యువగళం పాదయాత్ర అసలు మొదలవుతుందా లేదా అనే సందేహాలు వస్తున్నాయి.